విజయనగరం: విజయనగరం జిల్లా సాలూరు మండలం పెద్ద బోరబందలో విషాధం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మరణించారు. అక్కడే ఉన్న మరో విద్యార్థి వెంటనే స్పందించి... వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. దాంతో వారు చెరువు వద్దకు చేరుకుని... స్థానికుల సహాయంతో మృతదేహలను వెలికితీశారు. విద్యార్థుల మృతితో ఆ ఇంట రోదనలు మిన్నంటాయి.