
నీళ్లనుకొని యాసిడ్ తాగారు
మోత్కూరు: నీళ్లనుకొని యాసిడ్ తాగారు ఇద్దరు విద్యార్థులు. ప్రస్తుతం వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గురు వారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూ రు మండల కేంద్రంలోని సేక్రెడ్ హార్ట్ పాఠశాలలో చోటుచేసుకుంది. అడ్డగూడూరు మండలం మంగమ్మగూడెంకు చెందిన ఇటి కాల సైదులు, మమతకు ముగ్గురు సం తానం. సైదులు ఇదే పాఠశాలలో బస్సు క్లీనర్‌గా, మమత తల్లి ఎల్లమ్మ ఆయాగా పనిచేస్తున్నారు. సైదులు పెద్ద కుమారుడు సాగర్ రెండో తరగతి చదువుతున్నాడు. ఎల్లమ్మ యాసిడ్‌తో బాత్‌రూమ్‌లను క్లీన్ చేసి.. మిగిలిన యాసిడ్‌ను బాటిల్‌లో వేసి పక్కనే ఉన్న నీళ్ల బాటిళ్ల వద్ద పెట్టింది.
అమ్మ మ్మతో అప్పటికే అక్కడే ఉన్న మూడో మన మడు మణికంఠ, ఇంటర్‌వెల్ సమయంలో అక్కడికి వచ్చిన పెద్ద మనుమడు సాగర్ బాటిల్‌లో ఉన్న యాసిడ్‌ను నీళ్లుగా భావించి తాగారు. దీంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం 108లో భువ నగిరి ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. సాగర్ పరిస్థితి విషమంగా ఉండగా మణికంఠ చికిత్స పొందుతున్నాడు. కాగా, మణికంఠ తమ స్కూల్‌లో చదవడం లేదని ఆయాగా పనిచేస్తున్న ఎల్లమ్మ వద్దకు వచ్చాడని ప్రిన్సిపాల్ జోసఫ్ తెలిపారు.