పరీక్ష రాయడానికి వెళుతూ.. | Two students died in flow of canel | Sakshi
Sakshi News home page

పరీక్ష రాయడానికి వెళుతూ..

Published Wed, Jun 4 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM

పరీక్ష రాయడానికి వెళుతూ..

పరీక్ష రాయడానికి వెళుతూ..

* వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు విద్యార్థినులు మృతి
*  వీరిని రక్షించేందుకు యత్నించిన మరొకరు కూడా..

 
 కర్నూలు, న్యూస్‌లైన్: కర్నూలు జిల్లాలో భారీ వర్షానికి ఇద్దరు విద్యా ర్థులు బలయ్యారు. వారిని రక్షించడానికి యత్నించిన మరొకరూ మృతి చెందా రు.  కల్లూరు మండలం  గోకులపాడుకు చెందిన సుశీల, కళావతి మంగళవారం ఉదయం ఏడుగంటల సమయంలో కర్నూలులో ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు బయలుదేరారు.
 
 అప్పటికే ఎగువ ప్రాంతాల నుంచి వర్షం నీరు భారీగా వస్తుండటంతో గ్రామ శివారులోని వక్కెర వాగు పొంగింది. సుశీల తండ్రి నారాయణ (55) విద్యార్థినిలిద్దరినీ వాగును దాటించేందుకు తోడుగా వెళ్లాడు. వారు వాగు మధ్యలోకి చేరుకునే సరికి ప్రవాహ ఉధృతి పెరిగి కొట్టుకుపోయారు.  సల్కాపురం గ్రామం వద్ద వీరి మృతదేహాలను గుర్తించారు. వీరికంటే ముందు వాగు దాటే ప్రయత్నంలో ముగ్గురు మహిళలు కొట్టుకుపోతుండగా గ్రామస్తులు రక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement