హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం | two students missing in munipalle welfare hostel | Sakshi
Sakshi News home page

హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం

Published Sat, Feb 21 2015 10:05 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

two students missing in munipalle welfare hostel

గుంటూరు : గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లి సాంఘిక సంక్షేమ వసతి గృహం నుంచి ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారు. పీటీపర్రు హైస్కూలులో 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం ఇతర బాలురతో మాట్లాడుతుండగా  తోటి విద్యార్థినులు చూశారు. టీచర్లతో ఆ విషయం చెబుతామనడంతో భయపడిన సదరు బాలికలు శనివారం ఉదయం హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు.

విషయం తెలిసిన హాస్టల్ అధికారులు విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు.  అదృశ్యంపై  తల్లిదండ్రులు హస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులు కనిపించక పోతే వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని వారు వార్డెన్ను ప్రశ్నించారు. హాస్టల్ వార్డెన్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
(పొన్నూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement