Ponnuru
-
పొన్నూరు చేరుకున్న సీఎం జగన్
-
‘సైకిల్’ దొంగ దొరికాడోచ్!
గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, తాయిలాల ఎరవేసి ఓట్లు దక్కించుకునేందుకు టీడీపీ పన్నాగం పన్నింది. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసి తల్లిదండ్రుల మెప్పుపొందేందుకు భారీ సంఖ్యలో సైకిళ్లను కొనుగోలు చేసింది. టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల స్వగ్రామం చింతలపూడిలోని ఓ రైస్‌మిల్లులో నిల్వ చేశారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు వాటిని సీజ్ చేశారు. శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు పొన్నూరు నియోజకవర్గం ఎన్నికల అధికారులకు ఫోన్ చేశారు. మండలంలోని చింతలపూడి గ్రామంలోని ఓ రైస్‌మిల్‌లో టీడీపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఫొటో, సైకిల్ గుర్తుతో ఉన్న నూతన సైకిళ్లు వందల సంఖ్యలో ఉన్నాయని సమాచారం అందింది. వెంటనే అధికారులు హుటాహుటిన రైస్‌మిల్‌కు చేరుకుని వందల సంఖ్యలో ఉన్న సైకిళ్లను చూసి అవాక్కయ్యారు. అన్ని సైకిళ్లకు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ రంగు, గుర్తులు, అభ్యర్థి ఫొటో ఉండటంతో అన్ని సైకిళ్లను సీజ్ చేశారు. సంఘటనా స్థలానికి ఓ వ్యక్తి చేరుకుని తాను కోర్టు ద్వారా ఆక్షన్‌లో సైకిళ్లను దక్కించుకున్నానని, అధికారులకు తెలిపాడు. అయితే ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా సైకిళ్లు ఉన్నాయని, ఒకేచోట పార్టీ సింబల్స్‌తో ఇన్ని సైకిళ్లు ఉండరాదని తేల్చిచెప్పారు. కోడ్ ఉల్లంఘించిన కారణంగా 567 సైకిళ్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి వరదరాజులు, ఏంపీడీవో రత్నజ్యోతి తెలిపారు. ధూళిపాళ్ల నరేంద్ర ఎన్నికల తాయిలాల పంపకంతోనే విజయం సాధించే ప్రక్రియకు ఎన్నికల అధికారులు అడ్డుకట్ట వేశారు. ఇవి చదవండి: ‘ఆమ్ ఆద్మీ’ని అంతం చేసే కుట్ర -
పొన్నూరు గడ్డపై మంత్రి జోగి రమేష్ మైండ్ బ్లోయింగ్ స్పీచ్
-
చంద్రబాబు, రామోజీలకు ఎమ్మెల్యే కిలారి రోశయ్య సవాల్
-
కత్తి పద్మారావుతో కొమ్మినేని భేటీ
పొన్నూరు(గుంటూరు జిల్లా): ప్రముఖ రచయిత సామాజిక వేత్త కత్తి పద్మారావుతో ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం భేటి అయ్యారు. పొన్నూరులో కత్తి పద్మారావు ఇంటికి వెళ్ళి ఆయన్ను సత్కరించారు. ఇప్పటికి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాహిత్య రంగాలలో 80 పుస్తకాలు రచించిన పద్మారావు మరో 20 పుస్తకాలు రచించే పనిలో వున్నారు. ఈ సంధర్బంగా తాను రచించిన తన ఆటోబయోగ్రఫీ పుస్తకంతో పాటు ఆధునిక ఆంధ్ర రాజకీయాలు, భారత దేశ చరిత్ర - సామాజిక దృక్పథం, భారత రాజకీయాలు - అంబేద్కర్ దృక్పథం పుస్తకాలను కొమ్మినేనికి బహుకరించారు. కొమ్మినేని కూడ తాను రచించిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సామాజిక విశ్లేషణ పుస్తకాన్ని పద్మారావుకు అందచేసారు. కత్తి పద్మారావు మాట్లాడుతూ దళిత పేద వర్గాలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న పనులను అభినందించారు. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లు ఎప్పటికప్పుడు సత్వరమే ఇవ్వాలని ఆయన సూచించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం అవార్డులిస్తే బాగుంటుందని... వ్యవసాయ భూములు లేని దళిత, పేద వర్గాలకు ఎంతో కొంత భూమిని ఇచ్చే ఏర్పాటు జగన్ ప్రభుత్వం చేయగలిగితే ఇక ఆయనకు తిరుగుండదని పద్మారావు వాఖ్యానించారు. ఒకే సారి లక్ష ముఫై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత భారత దేశ చరిత్రలో ఒక జగన్ ప్రభుత్వానిదేనని... అదొక రికార్డని కొమ్మినేని గుర్తు చేసారు. ఎన్నికల ప్రణాళికలోని హామీల ప్రకారం 98 శాతం అమలు చేసిన ఘనత జగన్‌దేనని కొమ్మినేని చెప్పారు. వివిధ పథకాలను పేదలకు మానవత హృదయంతో జగన్ అమలు చేస్తున్నారని పద్మారావు ప్రశంసించారు. -
నైతిక విలువ లేని వ్యక్తి పవన్ కల్యాణ్ : కిలారి వెంకట రోశయ్య
-
స్వగ్రామంలో సీజేఐ ఎన్వీ రమణ
-
తెలుగువాడినైనందుకు గర్వపడుతున్నా
నేను పుట్టిన ఈ పొన్నవరం గ్రామం ఎంతో చైతన్యవంతమైనది. ఇక్కడే ఐదో తరగతి వరకు చదువుకున్నాను. ఈ గ్రామం వల్లే నేను అన్ని విషయాల్లో చైతన్యవంతుడిగా ఉండేవాడిని. తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలుగువారంతా ఎప్పటికీ మరువకూడదు. – సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సాక్షి, అమరావతి/నందిగామ: ‘కన్నతల్లి, ఉన్న ఊరు స్వర్గం కన్నా మిన్న అంటారు.. దీనికి నేను మాతృభాషను కూడా జోడిస్తాను.. తెలుగువాడిని అయినందుకు గర్వపడుతున్నాను’.. అని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. ‘పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు’ అన్న మహాత్ముని మాటలూ అక్షర సత్యమని, ఎంత అత్యున్నత స్థాయికి ఎదిగిన వారైనా పల్లె బిడ్డలే అని చెప్పారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తన స్వగ్రామమైన కృష్ణాజిల్లా, వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి శుక్రవారం విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు అత్యంత ఇష్టమైన ఎడ్లబండిపై ఆయనను మేళతాళాల మధ్య ఊరేగించారు. పెద్దఎత్తున స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు జాతీయ జెండాలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. దేశంలో అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నప్పటికీ తన మూలాలు ఈ గ్రామంలోనే ఉన్నాయని.. ఢిల్లీకి రాజైనా.. తాను ఎప్పటికీ పల్లె బిడ్డనే అని అన్నారు. గ్రామస్తులే తనకు తల్లిదండ్రులని, గ్రామాన్ని వదలి ఎంతో కాలమైనా, అత్యున్నత స్థానంలో ఉండి తన స్వగ్రామానికి రావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తనకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు రాజు, మార్కండేయులును ఆయన గుర్తుచేసుకున్నారు. ఇటువంటి అంకితభావం కలిగిన ఉపాధ్యాయులవల్లే తాను దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి కాగలిగానన్నారు. కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జరిగిన సభలో మాట్లాడుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మా ఊరు ఎంతో చైతన్యవంతమైంది గ్రామంతో తనకున్న అనుబంధాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గ్రామంలోనే ఐదో తరగతి వరకు చదువుకున్నానని, చిన్నప్పుడు కూడా ఎప్పుడూ తాను ఎవ్వరితోనూ దెబ్బలు తినలేదని, తన పుట్టిన ఊరు ఎంతో చైతన్యవంతమైందని, ఈ గ్రామంవల్లే తాను అన్ని విషయాల్లో ఎంతో చైతన్యవంతుడిగా ఉండేవాడినన్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి గ్రామంలో మూడు పార్టీలు మాత్రమే ఉండేవని, వీటివల్ల ఎప్పుడూ ఎటువంటి ఘర్షణ వాతావరణం నెలకొనలేదని, ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుండటం తనకు సంతోషంగా ఉందన్నారు. వీరులపాడు మండలం కమ్యూనిస్టులకు కంచుకోట అని, తన తండ్రి కూడా కమ్యూనిస్టు మద్దతుదారుగా ఉండే వారన్నారు. తనకు రాజకీయాలపట్ల కూడా ఎంతో ఆసక్తి ఉండేదని, అప్పట్లో స్వతంత్ర పార్టీకి మద్దతిచ్చానని సీజేఐ గుర్తుచేసుకున్నారు. మెట్ట ప్రాంతం కావడంతో అప్పట్లో ఇక్కడ తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని.. కానీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో ఆ సమస్య కొంతమేర పరిష్కారమైందన్నారు. దేశమంతా అభివృద్ధి పథంలో సాగుతున్న రోజుల్లో సైతం రాజకీయంగా ఎంతో చైతన్యవంతంగా ఉన్న తన ప్రాంతం ఇప్పటికీ పెద్దగా అభివృద్ధి చెందకపోవడం తనను బాధించిందన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజలంతా ఐక్యంగా ఉండి వాటిని పరిష్కరించుకోవడానికి నడుం బిగించాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని మరువకూడదు తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలుగువారు ఎప్పటికీ మరువకూడదని జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా, తెలుగు జాతి గొప్పదనాన్ని పలువురు చెబుతుండటం మనకు గర్వకారణమన్నారు. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలను ఎల్లవేళలా కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారుచేసిన భారత్ బయోటెక్ తెలుగు వారిది కావడం గర్వకారణమన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో మన తెలుగు వారే అనేక నిర్మాణ సంస్థలు స్థాపించారని.. ఉగ్రవాదులకు భయపడకుండా ఆఫ్గానిస్తాన్ పార్లమెంట్‌ను నిర్మించిన ఘనత మన తెలుగువారిదేనన్నారు. తెలుగు ప్రజల ప్రతిష్టకు ఏ మాత్రం భంగం కలగకుండా తాను ప్రవర్తిస్తానని కూడా హమీ ఇస్తున్నానని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. తెలుగు జాతికి గర్వకారణం : మంత్రి పెద్దిరెడ్డి సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి భారతదేశ అత్యున్న న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ తెలుగు జాతికే గర్వకారణమని కొనియాడారు. పట్టుదల, కృషి, అకుంఠిత దీక్షవల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని, ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే తత్వం సీజే సొంతమని, దానిని ప్రతిఒక్కరూ అలవరచుకోవాలన్నారు. ఒక తెలుగు వ్యక్తి ఈ స్థాయికి ఎదగడం యావత్ తెలుగు వారు గర్వపడాల్సిన విషయమన్నారు. దేశానికే వన్నెతెచ్చే విధంగా ఆయన పనిచేస్తారని, ఇటువంటి ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్ర శర్మ, న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్‌కుమార్, సత్యనారాయణమూర్తి, మానవేంద్రరాయ్, బట్టు దేవానంద్, లలితకుమారి, కృషమోహన్, జయసూర్య, మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, వసంత కృష్ణప్రసాద్, భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, ఎంపీ కేశినేని నాని, కలెక్టర్ జె. నివాస్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (ఆ సినిమాలకు పెట్టిన ఖర్చెంత.. పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? -
రూ.10 కోట్ల భూ కుంభకోణంలో జనసేన నాయకుడు
పెదకాకాని(పొన్నూరు): రూ.10 కోట్ల విలువైన భూ కుంభకోణంలో పెదకాకాని పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వారిలో జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పాత్ర ఉందనే అనుమానంతో అతడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అగతవరప్పాడుకు చెందిన కె. నారాయణమ్మ తన 1.42 ఎకరాల భూమిని తన మరణానంతరం మేనల్లుడు ఒడ్డెంగుంట శివసాగర్, అతని భార్య పద్మజకు దక్కేలా వీలునామా రాశారు. నారాయణమ్మకు ఆ పొలాన్ని అమ్మిన పాండురంగారావు ఆ భూమిని మళ్లీ గుంటూరుకు చెందిన మరొక వ్యక్తికి అమ్మాడు. దీంతో ఇరువర్గాలూ కోర్టును ఆశ్రయించాయి. 2012లో నారాయణమ్మ చనిపోగా, శివసాగర్ కూడా కొద్దికాలానికి మరణించాడు. ఇదే అదునుగా భూమిని కాజేసేందుకు యేమినేడి అమ్మయ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాధికారెడ్డి, రామనుజం కలిసి ఓ మీడియా ప్రతినిధి ద్వారా రూ.10 కోట్ల విలువైన భూమిని రూ.3 కోట్లకు గుత్తా సుమన్‌కు అమ్మేందుకు కుంచనపల్లి మాజీ సర్పంచి బడుగు శ్రీనివాసరావు పేరిట నకిలీ వీలునామా చేయించారు. లింక్ డాక్యుమెంట్ల కోసం మరో ఇద్దరి పేరిట మార్చారు. జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు, బొబ్బా వెంకటేశ్వరరావు, కోమలి, రాఘవ పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై 2017లో శివసాగర్ భార్య పద్మజ ఫిర్యాదు చేయగా, ప్రస్తుతం నిందితుల అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధంచేసినట్టు సమాచారం. -
బ్లాక్ ఫంగస్‌కు ఆయుర్వేద మందు
పొన్నూరు: కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లకు తీవ్ర ముప్పుగా పరిణమించిన బ్లాక్ ఫంగస్‌ను ఆయుర్వేద చికిత్సతో పూర్తిగా నివారించవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు ఎం.శ్రీనివాస్‌నాయక్ (ఎమ్మెస్సీ, ఎండీ) ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ మందులు వాడాలని చెప్పారు. బ్లాక్ ఫంగస్ వచ్చిన వెంటనే ఆయుర్వేద వైద్యులను సంప్రదించి రెండు చికిత్స పద్ధతుల్లో మందులు వాడుకుంటే దీని నుంచి బయటపడొచ్చని తెలిపారు. మొదటి చికిత్స విధానం.. 1. గంధక రసాయనం మాత్రలు రోజుకు రెండు సార్లు భోజనం తర్వాత వేసుకోవాలి. 2. ఖదిరాదివతి మాత్రలు రోజుకు రెండు సార్లు భోజనానికి ముందు.. 3. పంచతిక్త గుగ్గులువృతము 10 గ్రాములు గోరు వెచ్చని పాలతో రెండు సార్లు భోజనానికి ముందు.. 4. మృత్యుంజయ రసం రెండు మాత్రల చొప్పున రోజుకు మూడు సార్లు.. 5. ఒక గ్రాము శుభ్ర భస్మాన్ని గ్లాసు నీటితో కలిపి పుక్కిలించాలి. రెండో విధానం.. 1. ఆరోగ్యవర్ధనీవతి రెండు మాత్రలు రోజుకు రెండు సార్లు భోజనం తర్వాత వేసుకోవాలి. 2. విషతుందుకవతి రెండు మాత్రలు రోజుకు మూడు సార్లు భోజనం తర్వాత.. 3. హరిద్రఖండం 100 గ్రాముల్లో 10 గ్రాముల మల్లసింధూరం కలిపి తేనెతో 3 గ్రాముల చొప్పున రెండు సార్లు తీసుకోవాలి. 4. టంకణభస్మం ఒక గ్రాము గ్లాసు నీటితో కలిపి పుక్కిలించాలి. -
ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారు
-
అవ్వ నవ్వుకు ‘సాక్షి’
సాక్షి, పొన్నూరు : చుట్టూ తన వయసు వాళ్లు.. అందరి మోముల్లో బోసినవ్వులు.. ఇంత కాలం తనకు దూరమైన ఆ నవ్వుల వనంలో తానూ వచ్చి చేరింది. వేళకు నాలుగు మెతుకులు బువ్వ పెట్టే దారి దొరికింది. జీవన చరమాంకంలో నిడుబ్రోలులోని గోతాలస్వామి ఆశ్రమం అండగా నిలిచింది. మండలంలోని తాళ్లపాలేనికి చెందిన దీనమ్మ అనాథగా అవస్థలు పడుతున్న విషయాన్ని సాక్షి జిల్లా ఎడిషన్‌లో ఆదివారం దీన గాథ పేరుతో కథనం ప్రచురితమైంది. దీనికి గోతాల స్వామి ఆశ్రమ నిర్వాహకులు స్పందించారు. ఆమెను ఆశ్రమానికి తీసుకెళ్లి అక్కున చేర్చుకున్నారు. ఇది చదవండి : పండుముసలి దీన గాథ -
పండుముసలి దీన గాథ
సాక్షి, గుంటూరు : ఎండిన ఎముకలను కప్పేసిన ముతక శరీరం.. ఆ శరీరానికి చుట్టుకుని ఉన్న పాత చీర.. అది చీరో.. ఏదైనా పరదానో కూడా ఆమెకు తెలియదు. తొమ్మిది పదుల వయసు దాటి.. కాల పరీక్షలో కట్టెగా మారి జీవన పోరాటం చేస్తోంది. నలభై ఏళ్ల క్రితం ఇంటాయన ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయాడు. కడుపు కూడా పండకపోవడంతో ఆమె జీవితం మోడుగా మారింది. అప్పటి నుంచి ఏ కష్టమొచ్చినా చెప్పుకోవడానికి నా అనే వాళ్లు లేక పొంగుకొచ్చే దుఃఖాన్ని చీర కొంగులో దాచుకొనేది. ఇలా తొంభై ఏళ్ల సంధికి చేరింది. ఇప్పుడు ఆమె ఒంట్లో ఓపిక లేదు.. ఎక్కడికైనా వెళ్లాలన్నా కాళ్లలో సత్తువ లేదు.. తింటానికి తిండి లేదు.. అందుకే జీవం లేని ఆ గాజు కళ్లలో నిత్యం ఏదో వెతుకులాట.. ఏ మధ్యాహ్నపు ఎండ వేళకో.. ఏ చీకటి సంధ్యకో.. తాటాకు చప్పుడు అలికిడైతే చాలు... ఎవరైనా గుప్పెడు మెతుకులు తీసుకొస్తున్నారేమోనని ఆశగా చూసేది. చుట్టుపక్కల మనసున్న తల్లులు నాలుగు ముద్దలు తీసుకొస్తే ఆమె ఎండిన డొక్కల్లో కాస్త కదలిక వచ్చేది. ఆ సమయంలో ఆ ఇంకిన కళ్లలో కన్నీటి చెమ్మ చెంపలపై కాలువలయ్యేది. అప్పుడప్పుడూ ఆ నాలుగు ముద్దలు లేక.. ఆమె చేసే ఆర్తనాదం.. కడుపులో మెలిపెట్టే పేగుల రొదల్లో కలిసిపోతుండేది. ఇలా ఊరి చివర చిన్న పూరి గుడిసెలో బతుకీడుస్తున్న ఆ అభాగ్యురాలిని జడివాన మరింత కష్టాల్లో ముంచేసింది. ఉన్న గుడిసెను కూల్చేసి.. ఆమెను రోడ్డున పడేసింది. ఇప్పడు ఎండ మండినా, వాన తడిపినా తల దాచుకోవడానికి నీడ లేదు. అవ్వా.. ఏమైనా తిన్నావా అని అడిగితే.. వెంటనే ఒక చేత్తో పొట్ట తడుముకుంటూ.. మరో చేత్తో వచ్చిన వాళ్ల రెండు చేతులు గట్టిగా పట్టుకుని తేరిపారా చూస్తుంది.. తనను వాళ్ల వెంట తీసుకెళతారేమోనని.. పొన్నూరు మండలం తాళ్లపాలేనికి చెందిన దీనమ్మ అనే ఈ వృద్ధురాలు.. ఇలా మలి సంధ్యలో జీవచ్ఛవమై.. కనిపించిన ప్రతి ఒక్కరికీ రెండు చేతులు జోడిస్తోంది... ఎవరైనా మనసున్న మారాజులు మానవత్వపు నీడన తనను అక్కున చేర్చుకుంటారని.. -
పొన్నూరులో బహిరంగ సభలో షర్మిల
-
పిల్లి గట్టిగా అరిస్తే పులి అవుతుందా: షర్మిల
సాక్షి, పొన్నూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరులో బహిరంగ సభలో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారని, కుల,మత, పార్టీలకు అతీతంగా న్యాయం చేసిన ఏకైక నాయకుడు వైఎస్సార్ అని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడున్న చంద్రబాబు పాలనలో రైతులకు దగా చేశారని, డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు. చదవండి...(జగనన్నకి ఒక్క అవకాశం ఇవ్వండి: షర్మిల) మూడేళ్లలో పోలవరంలో పూర్తి చేస్తామని మాట తప్పారన్నారు. అమరావతిని అమెరికా చేస్తా, శ్రీకాకుళంను హైదరాబాద్ చేస్తా అని మాయమాటలు చెబుతున్నారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు పౌరుషం ఉందా అని సూటిగా ప్రశ్నించారు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేశారని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పొత్తుకు తహతహలాడారని ఆమె ఎద్దేవా చేశారు. పిల్లి గట్టిగా అరిస్తే పులి అవుతుందా, పిల్లి పిల్లే..పులి పులే.. అని సింహం సింగిల్‌గానే వస్తుందని వైఎస్ షర్మిల అన్నారు. జగనన్న బంపర్ మెజార్టీతో గెలుస్తాడని దేశవ్యాప్తంగా సర్వేలు చెబుతున్నాయన్న ఆమె... అన్నకు ఒక అవకాశం ఇస్తే మళ్లీ రాజన్న రాజ్యం తెస్తారన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే మళ్లీ జగనన్న రావాలని ఆకాంక్షించారు. జగరబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటువేసి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలారు రోశయ్యను ఆశీర్వదించాలని వైఎస్ షర్మిల కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
లారీ ఢీకొని మహిళ మృతి
పొన్నూరు: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో ఆదివారం ఉదయం జరిగింది. పొన్నూరుకు చెందిన పటాన్ ఫైజున్నీసాబేగం(60) మర్కస్ మసీద్ సమీపంలో రోడ్డు మీద నడచి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢొకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇసుక లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. -
వ్యక్తి దారుణ హత్య
గుంటూరు: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడి గ్రామ శివారులో గురువారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతనిని హత్య చేసి ముళ్ల పొదల్లో పడేశారు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 35 ఉంటుంది. స్థానికులు సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళా కౌన్సిలర్‌ను వీడియో తీసిన టీడీపీ నేత
గుంటూరు: పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ కౌన్సిలర్.. వైఎస్ఆర్ సీపీ మహిళా కౌన్సిలర్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. టీడీపీ కౌన్సిలర్.. మహిళా కౌన్సిలర్‌ను వీడియో తీశాడు. ఈ విషయం గమనించిన వైఎస్ఆర్ సీపీ మహిళా కౌన్సిలర్ తనను ఎందుకు వీడియో తీశారని ఆయనను ప్రశ్నించారు. టీడీపీ కౌన్సిలర్ అనుచితంగా వ్యవహరించడమే గాక మహిళా కౌన్సిలర్ ప్రశ్నించినందుకు ఆ పార్టీ వారు దురుసుగా ప్రవర్తించారు. -
పొన్నూరు కిడ్నాప్ కథ సుఖాంతం
గుంటూరు: రెండు రోజు కిందట జిల్లాలో సంచ లనం సృష్టించిన కిడ్నాప్ కథ సుఖాంతమైంది. జిల్లాలోని పొన్నూరుకు చెందిన తాపీమేస్త్రీ ఇబ్రహీం కుమారుడు కరీముల్లా(5)ను గుర్తుతెలియని అగంతకులు రెండురోజుల కిందట కిడ్నాప్‌కు చేశారు. బాలుడిని వదిలేయాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. ఇబ్రహీం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా.. కిడ్నాపర్ల జాడ కనిపెట్టారు. కిడ్నాపర్ ప్రకాశం జిల్లా నాగుప్పలపాడులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. కిడ్నాపరే బాలుడ్ని వదిలేసి పారిపోయాడు. పైగా బాలుడి జేబులో అతడి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లురాసిపెట్టాడు. రోదిస్తున్న బాలుడ్ని గుర్తించిన స్థానికులు అతడివద్ద ఉన్న నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసుల సాయంతో కరీముల్లాను ఇంటికి తెచ్చుకున్న తల్లిదండ్రులు తమ కుమారుడు క్షేమంగా ఇంటికి చేరినందుకు సంతోషించారు. కాగా, పని ఇప్పించమంటూ గతంలో ఇబ్రహీం వద్దకు వచ్చిన సతీష్ అలియాస్ ఏసుపాదం(32) అనే వ్యక్తే బాలుడ్ని కిడ్నాప్ చేశాడని, ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
పొన్నూరులో కిడ్నాప్ కలకలం
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. బాబును అప్పగించాలంటే పదిలక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఆగంతకుల నుంచి సమాచారం అందడంతో.. బాధితులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం ... గుంటూరు జిల్లా పొన్నూరు మండల కేంద్రానికి చెందిన షేక్ ఇబ్రహీం మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి షేక్ కరీముల్లా(5) అనే కుమారుడు ఉన్నాడు. అడ్డా మీద పనికి వెళ్లేందుకు సిద్ధమైన ఇబ్రహీంను ఓ వ్యక్తి వచ్చి తనది నెల్లూరు జిల్లా అని ఇక్కడ స్థానికంగా లాడ్జిలో ఉంటూన్నానని తనకు పని ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. దీంతో ఇబ్రహీం అతన్ని తనతో పాటు పనికి తీసుకెళ్లాడు. కాగా.. సోమవారం సాయంత్రం ఇబ్రహీం పని నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లో తన ఐదేళ్ల కుమారుడు షేక్ కరీముల్లా కనిపించకుండా పోయాడు. చుట్టపక్కల ఇళ్లలో వెతికినా లాభం లేకపోయింది. అయితే మంగళవారం ఉదయం ఆగంతకుడు ఇబ్రహీంకు ఫోన్ చేసి నీ బాబు నీవద్దకు క్షేమంగా చేరాలంటే రూ. పదిలక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం పోలీసులకు చెబితే బాబును చంపేస్తానని బెదిరించాడు. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పని ఇప్పించమని తన వద్దకు వచ్చిన వ్యక్తి పేరు సతీష్ అని బాధితుడు గుర్తించాడు. అతడి స్వస్థలం పొన్నూరుగా గుర్తించారు. అతడే నిందితుడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
గుంటూరు : గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లి సాంఘిక సంక్షేమ వసతి గృహం నుంచి ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారు. పీటీపర్రు హైస్కూలులో 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం ఇతర బాలురతో మాట్లాడుతుండగా తోటి విద్యార్థినులు చూశారు. టీచర్లతో ఆ విషయం చెబుతామనడంతో భయపడిన సదరు బాలికలు శనివారం ఉదయం హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. విషయం తెలిసిన హాస్టల్ అధికారులు విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అదృశ్యంపై తల్లిదండ్రులు హస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులు కనిపించక పోతే వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని వారు వార్డెన్‌ను ప్రశ్నించారు. హాస్టల్ వార్డెన్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. (పొన్నూరు) -
ఫలించిన ఓ తల్లి న్యాయపోరాటం : ఆ నలుగురికి జైలు!
పొన్నూరు రూరల్ : ఓ కన్న తల్లి ఆరేళ్లపాటు చేసిన న్యాయపోరాటం ఫలించింది. ఆమె కుమారుడిని హింసించారన్న కేసులో ముగ్గురు పోలీస్ అధికారులు, మరో ప్రభుత్వ వైద్యుడికి ఏడాదిపాటు జైలు శిక్ష, మరో వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ పొన్నూరు అదనపు జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం మధ్యాహ్నం సంచలనాత్మక తీర్పు వెల్లడించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేసు పూర్వాపరాలు ఇలావున్నాయి. తనకు ఫోన్‌చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2008 సెప్టెంబర్ 24న గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరుకు చెందిన సౌపాటి రవి అనే వ్యక్తిని అప్పటి రూరల్ ఎస్ఐ టి. బ్రహ్మయ్య అరెస్టు చేశారు. ఇది తెలిసి స్టేషన్‌కు చేరుకున్న గ్రామస్తులకు రవిని చూపించకుండా పంపివేశారు. ఆ రోజు రాత్రి సిఐ విజయకుమార్, ఎస్ఐ బ్రహ్మయ్యలు లాఠీలతో రవి అరికాళ్లపై తీవ్రంగా కొట్టి హింసించారు. మరుసటి రోజు గాయాలతో వున్న రవిని చూసి తల్లి బోరున విలపించింది. పోలీసుల తీరుపై ఆమె కోర్టును ఆశ్రయించడంతో జడ్జి, లాం శ్రీనివాస్‌ను అడ్వకేట్ కమిషన్‌గా నియమించారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న రవిని గుర్తించిన శ్రీనివాస్ డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ సెల్వరాజ్ సమక్షంలో బాధితుడు నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం రవిని అప్పటి జడ్జి చంద్రశేఖర్ ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఆదేశం మేరకు గాయపడిన రవికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించి జైలుకు తరలించారు. నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యాధికారి నూరుల్‌హుదా పోలీసులకు అనుకూలంగా తప్పుడు రిపోర్టు ఇచ్చారు. ఇది గుర్తించిన బాధితుని బంధువులు స్థానిక న్యాయవాది జి.ఎస్ రాయల్‌ను ఆశ్రయించగా, ఆయన బాధితుని తరఫున కోర్టులో వాదించారు. అదే నెలలో బాధితుడు రవిని విడుదల చేశారు. కేసు కోర్టులో ఉండగానే సిఐ విజయకుమార్ ప్రమోషన్ పొంది డీఎస్పీగా పదవీ విరమణ చేశారు. రూరల్ ఎస్ఐ టి. బ్రహ్మ య్య ప్రస్తుతం సిఐడీ విభాగంలో సీఐగా ఉన్నారు. ఏఎస్ఐ సెల్వరాజ్ ఎస్ఐగా రిటైర్ అయ్యారు. అప్పటి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ నూరుల్‌హుదా ప్రస్తుతం పాండ్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆరేళ్ల సుధీర్ఘ న్యాయపోరాటం అనంతరం వాదప్రతివాదనలు విన్న జడ్జి కె. రవి, అప్పటి సిఐ విజయకుమార్, ఎస్ఐ టి. బ్రహ్మయ్య, ఏఎస్ఐ సెల్వరాజ్, వైద్యాధికారి నూరుల్హుదాలకు ఒక సంవత్సరం జైలుశిక్ష, మరో వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ** -
అజ్ఞాతం వీడని ధూళిపాళ్ల!
తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉండి తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడుకు తెలుగు తమ్ముళ్ల వ్యవహారం తలనొప్పిగా మారింది. కేబినెట్లో చోటుదక్కిని తమ్ముళ్లు కొంతమంది అలకబూనితే,మరి కొందరు అధినేతకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల్లో గెలుపొందినవారంతా ఎవరికివారే మంత్రి పదవులు వస్తాయని అంచనా వేసుకున్నారు. అయితే ఆశలన్నీ తలకిందలయ్యే సరికి వారిలో అసంతృప్తి నెలకొంది. దాంతో బెర్త్ దక్కక భంగపడిన తమ్ముళ్లలో ఒకరు ఆస్పత్రి పాలైతే...మరొకరు అజ్ఞాతంలో గడుపుతున్నారు. దాంతో పదవుల పందారంపై టీడీపీలో రేగిన అసంతృప్తులు ఇంకా చల్లారడం లేదు. అటువంటి వారిలో గుంటూరు జిల్లా పొన్నూరు తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా ఉన్నారు. అయిదో సారి విజయం సాధించి...మంత్రివర్గంలో ఈసారి తనకు సీటు గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయిన ఆయనకు అవకాశం దక్కలేదు. దాంతో మనస్తాపానికి గురైన ధూళిపాళ్ల ఇప్పటికీ పార్టీకి అందుబాటులోకి రాలేదు. అవకాశం దొరికినప్పుడల్లా మైక్ దొరికితే వదలి పెట్టని ఆయన ఇప్పుడు అజ్ఞాతంలో కొనసాగుతున్నారు. బాబు ప్రమాణ స్వీకారానికి కూడా ధూళిపాళ్ల డుమ్మా కొట్టారు. అంతకు ముందు ఆయనను బుజ్జగించేందుకు పలువురు పార్టీ నేతలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు ఎవరితోనూ అందుబాటులోకి రాలేదు. ఆయన ఇప్పటికి కూడా కూడా స్విచ్చాఫ్ చేసి ఉంచటంతో ఇంకా అలక కొనసాగిస్తున్నారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. మరోవైపు ధూళిపాళ్లకు మంత్రి పదవి రాకపోవడాన్ని జీర్ణించుకోలేని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నిరసన కూడా తెలిపారు. ఓ దశలో బాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు యత్నించిన ఆయనను కార్యకర్తలే అడ్డుకోవటం విశేషం. అయితే మంత్రివర్గంలో చోటు దక్కనివారి సేవలను పార్టీ, ప్రభుత్వంలో వివిధ రూపాలలో ఉపయోగించుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి
పొన్నూరు రూరల్, న్యూస్‌లైన్ :మండలంలోని మన్నవ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వర్గీయులు రాడ్లు, గొడ్డళ్లు, కర్రలతో దాడిచేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రేగులగడ్డ సత్యానందం, రేగులగడ్డ బాలరాజు, గొల్లా బాలశౌరిలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మన్నవ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైఎస్సార్ సీపీకి ఆధిక్యం రావడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు రాష్ట్రం, నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి వచ్చే సరికి అదును చూసి ఒక్కసారిగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. రేగులగడ్డ అంకారావు ఉదయాన్నే పొలం వెళ్లి వస్తుండగా దారిలో ఉన్న టీడీపీ వర్గీయులు ఒక్కసారిగా అతనిపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన రేగులగడ్డ సత్యానం దం, రేగులగడ్డ బాలరాజు, గొల్లా బాలశౌరిలను టీడీపీకి చెందిన బండ్లమూడి బాబూరావు, బండ్లమూడి చింపిరయ్య, బండ్లమూడి అశోక్, బండ్లమూడి నాగమల్లేశ్వరరావు, బండ్లమూడి శ్రీనివాసరావు, బండ్లమూడి నల్లయ్య, బండ్లమూడి సురేష్, గొల్లా స్వామియేలు, అన్నవరపు చెంచునాయుడులు రాడ్లు, గొడ్డళ్లు, కర్రలతో దాడిచేశారు. బాధితులను చికిత్సనిమిత్తం పొ న్నూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. తీవ్రగాయాలైన బాధితులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు. -
పొన్నూరు చేరుకున్న షర్మిళ
-
"సాక్షి" చైతన్యపథం - పొన్నూరు