గుంటూరు: రెండు రోజు కిందట జిల్లాలో సంచ లనం సృష్టించిన కిడ్నాప్ కథ సుఖాంతమైంది. జిల్లాలోని పొన్నూరుకు చెందిన తాపీమేస్త్రీ ఇబ్రహీం కుమారుడు కరీముల్లా(5)ను గుర్తుతెలియని అగంతకులు రెండురోజుల కిందట కిడ్నాప్‌కు చేశారు. బాలుడిని వదిలేయాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. ఇబ్రహీం పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా.. కిడ్నాపర్ల జాడ కనిపెట్టారు. కిడ్నాపర్ ప్రకాశం జిల్లా నాగుప్పలపాడులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. కిడ్నాపరే బాలుడ్ని వదిలేసి పారిపోయాడు. పైగా బాలుడి జేబులో అతడి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లురాసిపెట్టాడు.
రోదిస్తున్న బాలుడ్ని గుర్తించిన స్థానికులు అతడివద్ద ఉన్న నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసుల సాయంతో కరీముల్లాను ఇంటికి తెచ్చుకున్న తల్లిదండ్రులు తమ కుమారుడు క్షేమంగా ఇంటికి చేరినందుకు సంతోషించారు. కాగా, పని ఇప్పించమంటూ గతంలో ఇబ్రహీం వద్దకు వచ్చిన సతీష్ అలియాస్ ఏసుపాదం(32) అనే వ్యక్తే బాలుడ్ని కిడ్నాప్ చేశాడని, ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
పొన్నూరు కిడ్నాప్ కథ సుఖాంతం
Published Wed, Jul 29 2015 7:50 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
Advertisement
Advertisement