పొన్నూరు: కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లకు తీవ్ర ముప్పుగా పరిణమించిన బ్లాక్ ఫంగస్‌ను ఆయుర్వేద చికిత్సతో పూర్తిగా నివారించవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు ఎం.శ్రీనివాస్‌నాయక్ (ఎమ్మెస్సీ, ఎండీ) ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ మందులు వాడాలని చెప్పారు. బ్లాక్ ఫంగస్ వచ్చిన వెంటనే ఆయుర్వేద వైద్యులను సంప్రదించి రెండు చికిత్స పద్ధతుల్లో మందులు వాడుకుంటే దీని నుంచి బయటపడొచ్చని తెలిపారు.
మొదటి చికిత్స విధానం..
1. గంధక రసాయనం మాత్రలు రోజుకు రెండు సార్లు భోజనం తర్వాత వేసుకోవాలి.
2. ఖదిరాదివతి మాత్రలు రోజుకు రెండు సార్లు భోజనానికి ముందు..
3. పంచతిక్త గుగ్గులువృతము 10 గ్రాములు గోరు వెచ్చని పాలతో రెండు సార్లు భోజనానికి ముందు..
4. మృత్యుంజయ రసం రెండు మాత్రల చొప్పున రోజుకు మూడు సార్లు..
5. ఒక గ్రాము శుభ్ర భస్మాన్ని గ్లాసు నీటితో కలిపి పుక్కిలించాలి.
రెండో విధానం..
1. ఆరోగ్యవర్ధనీవతి రెండు మాత్రలు రోజుకు రెండు సార్లు భోజనం తర్వాత వేసుకోవాలి.
2. విషతుందుకవతి రెండు మాత్రలు రోజుకు మూడు సార్లు భోజనం తర్వాత..
3. హరిద్రఖండం 100 గ్రాముల్లో 10 గ్రాముల మల్లసింధూరం కలిపి తేనెతో 3 గ్రాముల చొప్పున రెండు సార్లు తీసుకోవాలి.
4. టంకణభస్మం ఒక గ్రాము గ్లాసు నీటితో కలిపి పుక్కిలించాలి.
బ్లాక్ ఫంగస్‌కు ఆయుర్వేద మందు
Published Mon, May 24 2021 5:02 AM | Last Updated on Mon, May 24 2021 5:27 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment