
సాక్షి, పొన్నూరు : చుట్టూ తన వయసు వాళ్లు.. అందరి మోముల్లో బోసినవ్వులు.. ఇంత కాలం తనకు దూరమైన ఆ నవ్వుల వనంలో తానూ వచ్చి చేరింది. వేళకు నాలుగు మెతుకులు బువ్వ పెట్టే దారి దొరికింది. జీవన చరమాంకంలో నిడుబ్రోలులోని గోతాలస్వామి ఆశ్రమం అండగా నిలిచింది. మండలంలోని తాళ్లపాలేనికి చెందిన దీనమ్మ అనాథగా అవస్థలు పడుతున్న విషయాన్ని సాక్షి జిల్లా ఎడిషన్‌లో ఆదివారం దీన గాథ పేరుతో కథనం ప్రచురితమైంది. దీనికి గోతాల స్వామి ఆశ్రమ నిర్వాహకులు స్పందించారు. ఆమెను ఆశ్రమానికి తీసుకెళ్లి అక్కున చేర్చుకున్నారు.
ఇది చదవండి : పండుముసలి దీన గాథ
Comments
Please login to add a commentAdd a comment