రావులపాలెం : రావులపాలెం మండలం ఊబలంక గౌతమి ఘాట్‌లో గురువారం పుష్కర స్నానాలకు వె ళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. సాయంత్రానికి ఒకరి మృతదేహం లభ్యమైంది. ఊబ లంకకు చెందిన మేడపాటి భాస్కరరెడ్డి(16), కొమరాజులంక చెందిన వెలగల సాయి గణేష్‌రెడ్డి(16)లు స్నేహితులు. రావులపాలెంలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఈ ఏడాది పదోతరగతి పూర్తి చేశారు. ప్రస్తుతం భాస్కరరెడ్డి రాజమండ్రి ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్‌లో చేరాడు. సాయిగణేష్‌రెడ్డి పాలిటెక్నిక్ చది వేందుకు సన్నద్ధమవుతున్నాడు. సాయిగణేష్‌రెడ్డి అమ్మమ్మ వాళ్లది ఊబలంక కావడంతో పుష్కరాలకు అక్కడే ఉంటున్నా డు.
ఊబలంకలో అధికారికంగా ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ లో నీటి మట్టం తక్కువగా ఉంటడంతో చాలా మంది ఏటిగట్టుకు సుమారు రెండు కిలో మీటర్ల దూరంలోని ప్రధాన పాయ వద్దకు వె ళ్లి స్నానాలు చేస్తున్నారు. భాస్కరరెడ్డి, గణేష్‌రెడ్డి గురువారం ఉదయం 7 గంటలకు ఆ పాయ వద్దకు వెళ్లారు. ఇంటికి రాకపోవడంతో రాత్రి 9 గంటలకు ఘాట్‌లోని అధికారులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మత్స్యకారులు వలలతో గాలించారు. సీఐ పీవీ రమణ, ఎస్సై త్రినాథ్ అక్కడకు చేరుకున్నారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
ఘాట్‌లో ఏర్పాట్ల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
ఊబలంక ఘాట్‌కు సంబంధించి అధికారులు చేస్తున్న ఏర్పాట్లలో నిర్లక్ష్యం కనిపిస్తుందని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల గల్లంతు సమాచారంతో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీఓ జి.గణేష్‌కుమార్, డీఎీస్పీ అంకయ్య, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీ, జగ్గిరెడ్డి మధ్య వాగ్వివాదం ేసీ సత్యనారాయణ మాట్లాడుతూ తమ అధికారిక లెక్కల్లో ఊబలంక సీ గ్రేడ్ ఘాట్ అని, ఘటన జరిగిన ప్రాంతం అధికారిక ఘాట్ పరిధిలోకి రాదన్నారు.
దీనిపై జగ్గిరెడ్డి మాట్లాడుతూ అధికార ఘాట్ పరిధిలోకి రాదని చెబుతున్న అధికారులు అక్కడ పడవ, ఈతగాళ్లను ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. బాధితులకు నాయ్యం జరిగే వరకూ ఇక్కడే కూర్చుంటానని మృతదేహం వద్ద బైఠాయించారు. పరిహారం విషయం తేల్చేంతవరకూ మృతదేహాన్ని తీసుకువెళ్లనివ్వమని జగ్గిరెడ్డితోపాటు గ్రామస్తులు స్పష్టం చేయడంతో జేసీ అక్కడి నుంచి నిష్ర్కమించారు. అనంతరం జగ్గిరెడ్డి కలెక్టర్, డిప్యూటీ సీఎం చినరాజప్పతో ఫోన్‌లో మాట్లాడి పరిిస్థితిని వివరించారు. రూ. 3 లక్షల చొప్పున ఎక్‌రరగేషియా చెల్లించేందుకు చినరాజప్ప అంగీకరించారని జగ్గిరెడ్డి తెలిపారు. ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు.
ఘాట్‌లో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
Published Fri, Jul 17 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM
Advertisement