పరిగి, న్యూస్‌లైన్: ఒంటరిగా ఉన్న వివాహితను కత్తితో బెదిరించి లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు సోమవారం రిమాండుకు తరలించా రు. నిందితుల్లో ఒకరు డిగ్రీ.. మరొకరు ఇంటర్ చదువుతున్నారు. సోమవారం పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు లకా్ష్మరెడ్డి, నగేష్‌లతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. కుల్కచర్ల మండ లం కామునిపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహిత(23)పై గతనెల 30న మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కత్తితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడి పరారయ్యారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆదివా రం నిందితులను అరెస్టు చేసి సోమవారం కటకటాల వెనక్కి పంపారు.
పథకం ప్రకారమే అఘాయిత ్యం..
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం గొండ్యాల గ్రామానికి చెంది న వివాహిత(23) ఐదు నెలల క్రితం ప్రసవం కోసం పుట్టిల్లు అయిన కుల్కచర్ల మండలం కామునిపల్లి గ్రామానికి వచ్చింది. నాలుగు నెలల క్రితం ఆమెకు కాన్పు జరిగింది. 15 రోజుల క్రితం ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. తల్లిదండ్రులు, ఇతర కుటుంబీకులు పొలం పనులకు వెళ్తుండడంతో మహిళ ఇంటి వద్ద ఒంటరిగా ఉంటోంది. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి బోడ శ్రీశైలం(21) ఆమెపై కన్నేశాడు. ఎలాగైనా తన కామవాంఛను తీర్చుకోవాలనుకున్నాడు. ఇదే విషయం అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు ఇంటర్ విద్యార్థి రాజేందర్‌రెడ్డి(19)తో చెప్పాడు. ఇద ్దరు కలిసి పథకం పన్నారు. ఈక్రమంలో గత నెల 30న మధ్యాహ్నం వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉండటంతో లోపలికి చొరబడ్డారు. అరిస్తే చంపేస్తామని కత్తితో బెదిరించారు. ఒకరి తర్వాత ఒకరు రాజేందర్‌రెడ్డి, శ్రీశైలంలు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు కుటుంబీకుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసు లు ఆదివారం నిందితులను అరెస్టు చేశారు. తమదైన శైలిలో పోలీసులు వారిని విచారించగా చేసిన నేరం అంగీకరించారు. బాలింతను బెదిరిం చేందుకు ఉపయోగించిన కత్తి ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకొని సోమవారం రిమాండుకు తరలించారు.
వివాహితపై అత్యాచారం.. పథకం ప్రకారమే...
Published Mon, Jan 6 2014 11:58 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement