సంగెం (వరంగల్ జిల్లా) : ఒంటరిగా వ్యవసాయ బావి వద్దకు వెళుతున్న వివాహితను అటకాయించి బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలోని గవిచర్ల గ్రామంలో చోటు చేసుకుంది. సంగెం ఎస్సై వి.క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... గవిచర్ల గ్రామానికి చెందిన ఓ వివాహిత(20) శనివారం ఉదయం తన భర్తకు సద్దితీసుకుని ఒంటరిగా చెరువుగట్టుపై నుంచి వెళుతోంది. అదే గ్రామానికి చెందిన రావుల వేణు(35) ఆమెను వెంబడించి చెరువు శిఖం తుమ్మ పొదల్లోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఎవరికైనా చెప్పితే చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడ్డ ఆమె భర్తకు ఏంచెప్పకుండా.. సద్ది ఇచ్చి ఇంటికి వచ్చింది. వివాహిత చిన్నబోయి ఉండడంతో భర్త, అత్తమామలు అడగడంతో జరిగిన విషయాన్ని చెప్పింది. ఆదివారం ఉదయం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వివాహితపై లైంగిక దాడి
Published Sun, May 24 2015 8:33 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement