వివాహితపై ఎస్‌ఐ లైంగిక వేధింపులు | SI Sexual Harassment on Married woman | Sakshi
Sakshi News home page

వివాహితపై ఎస్‌ఐ లైంగిక వేధింపులు

Published Tue, Oct 10 2017 4:17 AM | Last Updated on Sun, Sep 2 2018 3:44 PM

SI Sexual Harassment on Married woman - Sakshi

సాక్షి, నూజివీడు: ప్రజల మానప్రాణాలను రక్షించాల్సిన పోలీసులే గాడి తప్పుతున్నారు. ఇటీవల కృష్ణా జిల్లాలో హనుమాన్‌ జంక్షన్‌ ఎస్‌ఐ విజయకుమార్‌ నూజివీడుకు చెందిన ఒక బ్యూటీపార్లర్‌ నిర్వాహకురాలితో వివాహేతర సంబంధం నెరపి సస్పెండ్‌ అయిన సంగతి తెలిసిందే. దీన్ని మరవకముందే నూజివీడుకు చెందిన ఒక ఎస్‌ఐ ఓ వివాహితను ఫోన్‌లో లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. తనను వేధించొద్దని, ఏదైనా అల్లరి అయితే ఆత్మహత్యే శరణ్యమని వివాహిత ఎస్‌ఐను ఫోన్లో వేడుకున్నా ఆ కామాంధుడు కనికరించలేదని సమాచారం.

పైగా గత కొద్ది రోజులుగా ఆమెకు అదేపనిగా ఫోన్‌ చేసి వేధిస్తుండటంతో ఎస్‌ఐ మాటలను రికార్డ్‌ చేసి ఆడియో క్లిప్పింగ్‌లతో సహా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా ఎస్పీ.. ఎస్‌ఐని సోమవారం మచిలీపట్నంలోని తన కార్యాలయంలో మందలించి సెలవులో వెళ్లమని ఆదేశించినట్లు తెలుస్తోంది. కాపాడాల్సిన పోలీసే ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement