వరుసకు చెల్లెలినే చెరిచాడు | Sexual assault sisterly | Sakshi
Sakshi News home page

వరుసకు చెల్లెలినే చెరిచాడు

Published Fri, Jun 10 2016 1:40 AM | Last Updated on Sun, Sep 2 2018 3:46 PM

వరుసకు చెల్లెలినే చెరిచాడు - Sakshi

వరుసకు చెల్లెలినే చెరిచాడు

వీణవంక : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మృగాడు వరుసకు చెల్లెలినే చెరబట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వీణవంక మండల కేంద్రానికి చెందిన గెల్లు నాగరాజు(26) తనకు వరుసకు చెల్లెలుపై కన్నేశాడు. మానసిక వికలాంగురాలైన యువతి(24) రెండు నెలల క్రితం పత్తి చేనులో ఒంటరిగా ఉండటం చూసి ఆమెపై లైంగికదాడికి దిగాడు. మళ్లీ పదిహేనురోజుల క్రితం యువతి కుటుంబసభ్యులు ఆసుపత్రికి వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న నాగరాజు మరోసారి యువతిపై అత్యాచారం చేశాడు.

విషయం బయటకు చెప్తే చంపుతానని బెదరించడంతో బాధితురాలు వెంటనే ఎవరికీ చెప్పలేదు. జరిగిన సంఘటనపై తల్లి నాగమణమ్మకు గురువారం చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నాగరాజుపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై దామోదర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement