‘ఎవరెస్టు’ వీరులకు ఘనస్వాగతం | great welcome to teenagers who climbed Everest | Sakshi
Sakshi News home page

‘ఎవరెస్టు’ వీరులకు ఘనస్వాగతం

Published Mon, Jun 9 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM

‘ఎవరెస్టు’ వీరులకు ఘనస్వాగతం

‘ఎవరెస్టు’ వీరులకు ఘనస్వాగతం

సాక్షి,హైదరాబాద్: ఎవరెస్టు శిఖరంపై భారత పతాకాన్ని ఎగరువేసిన తెలుగు తేజాలు లావత్‌పూర్ణ, సాధనపల్లి అనంద్‌కుమార్‌కు ఆదివారం ఇక్కడ ఘనస్వాగతం లభించింది. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే అభిమానులు గురుకుల సంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్రపు బగ్గీలో ర్యాలీగా బయటికి తీసుకొచ్చారు. విమానాశ్రయం నుంచి ర్యాలీగా శంషాబాద్‌కు చేరుకున్న పూర్ణ, ఆనంద్‌లు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా పాతబస్తీకి చేరుకున్నారు. ఫలక్‌నుమాలోనూ స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మొజంజాహిమార్కెట్, గన్‌పార్కు మీదుగా ట్యాంక్‌బంక్‌కు భారీ ర్యాలీ చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement