పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎస్సీ బాలికల వసతి గృహం నుంచి ఇద్దరు విద్యార్థునులు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎస్సీ బాలికల వసతి గృహం నుంచి ఇద్దరు విద్యార్థునులు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వసతి గృహం ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు రెండు రోజుల క్రితం అదృశ్యమైయ్యారని హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక కళాశాలలో వారు ఇంటర్ చదువుతున్నారని వార్డెన్ తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికల అదృశ్యంపై సమాచారం అందుకున్న వారి తల్లిదండ్రులు హస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులు అదృశ్యమైతే వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని వారు వార్డెన్ను ప్రశ్నించారు. హాస్టల్ వార్డెన్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.