యాకుత్‌పురా (హైదరాబాద్): ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఇద్దరు విద్యార్థులు దాడి చేసి గాయపరిచారు. మీర్‌చౌక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డబీర్‌పురా కోమటివాడి ప్రాంతానికి చెందిన జాహేద్ హుస్సేన్ (19), బషీర్ అలీ (18) నాంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. శుక్రవారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు నాంపల్లి వద్ద ఫలక్‌నుమా డిపోకు చెందిన బస్సు ఎక్కారు.
దారుషిఫా వరకు టికెట్టు కొనుగోలు చేశారు. స్టాప్ వచ్చినా బస్సు దిగకుండా మహిళలు వెళ్లే ద్వారం వద్దే నిలబడి ఉన్నారు. దీంతో బస్సు దిగాలని డ్రైవర్ అనడంతో విద్యార్థులు వాగ్వివాదానికి దిగారు. మాటా మాటా పెరగడంతో హుస్సేన్, బషీర్‌లు డ్రైవర్ బాలకృష్ణపై దాడికి పాల్పడ్డారు. గాయపడిన బాలకృష్ణ మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
బస్సు డ్రైవర్‌పై దాడి: ఇద్దరు విద్యార్థుల అరెస్ట్
Published Fri, Jan 8 2016 7:16 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM
Advertisement
Advertisement