నల్లగొండ: సడెన్‌గా యూ టర్న్‌ తీసుకున్న కంటైనర్‌.. కార్లు, బస్సు ఢీ | Road Accident Take Place At Nalgonda Pedakaparthy | Sakshi
Sakshi News home page

నల్లగొండ: సడెన్‌గా యూ టర్న్‌ తీసుకున్న కంటైనర్‌.. కార్లు, బస్సు ఢీ

Published Mon, Dec 6 2021 11:08 AM | Last Updated on Mon, Dec 6 2021 3:33 PM

Road Accident Take Place At Nalgonda Pedakaparthy - Sakshi

సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద కాపర్తి సమీపంలో రోడ్డు మీద వస్తోన్న ఓ కంటైనర్‌ సడెన్‌గా యూటర్న్ తీసుకుంది. ఈ సమయంలో కంటైనర్‌ వెనకాలే వస్తున్న కార్లు దీన్ని గమనించి స్లో అయ్యాయి. ఇదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న ఖమ్మం జిల్లా మధిరకు చెందిన‌ ఆర్టీసీ బస్సు.. ​కంటైనర్‌ని ఢీ కొట్టింది‌.
(చదవండి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి)

ఈ క్రమంలో కంటైనర్‌ వెనకే ఉన్న కార్లు దాని కిందకు చొచ్చుకుని వెళ్లాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో పోలీస్ సిబ్బంది క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కాసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది‌. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

చదవండి: కళ్లెదుటే ఆరిన కంటి దీపాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement