'ఆయనతో సినీరంగానికి నష్టం'
బొమ్మనహళ్లి: కన్నడ సినిమా రంగం నిలబడటానికి డాక్టర్ రాజ్‌కుమార్ ఎంతో కృషి చేశారు. అయితే ఇటీవల మరో సీనియర్ నటుడు ఒకరు సినిమా రంగాన్ని మొత్తం పాడు చేస్తున్నారు. ఆయనెవరు, విషయం ఏమిటన్నది మరోసారి మీడియా ముందు చెబుతానని కన్నడ సినిమా హాస్యనటుడు బుల్లెట్ ప్రకాశ్ అన్నారు.
బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కన్నడ సినిమా రంగంలో నటుల మధ్య విభేదాలున్నాయని, కొంతమంది గ్రూపులుగా ఏర్పడి సినిమా రంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు.