Bullet Prakash
-
స్టార్ కమెడియన్ మృతి
బెంగుళూరు: కన్నడ స్టార్ కమెడియన్ బుల్లెట్ ప్రకాశ్ (44) సోమవారం సాయంత్రం మృతి చెందారు. కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జీర్ణ సంబంధమైన సమస్యతో ఆయన మార్చి 31న ఆస్పత్రిలో చేరగా.. కిడ్ని, కాలేయ వ్యాధులు ఉన్నాయని తేలింది. ఈక్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారని ప్రకాశ్ సన్నిహితులు తెలిపారు. (చదవండి: రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మీ కనకాల మృతి) కాగా, 300లకు పైగా సినిమాల్లో నటించిన ప్రకాశ్ కన్నడ సినీ రంగంలో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించారు. పునీత్ రాజ్‌కుమార్, దర్శన్, శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, సుదీప్ కిచ్చ వంటి బడా హీరోలతో కలిసి నటించారు. మస్త్ మజా మాది (2008), అయితలకడి (2010), మల్లిఖారుజన (2011), ఆర్యన్ (2014) సినిమాలు ఆయనకు నటుడిగా గుర్తింపు తీసుకొచ్చాయి. ఆయన హావభావాలకు గాను బుల్లెట్ ప్రకాశ్‌గా పేరు స్థిరపడిపోయింది. బిగ్‌బాస్ కన్నడ సీజన్-2లో కూడా ఆయన పాల్గొన్నారు. ప్రకాశ్ బీజేపీ కార్యకర్తగా పనిచేశారు. (చదవండి: బాలీవుడ్లో మరో కరోనా కేసు) -
'ఆయనతో సినీరంగానికి నష్టం'
బొమ్మనహళ్లి: కన్నడ సినిమా రంగం నిలబడటానికి డాక్టర్ రాజ్‌కుమార్ ఎంతో కృషి చేశారు. అయితే ఇటీవల మరో సీనియర్ నటుడు ఒకరు సినిమా రంగాన్ని మొత్తం పాడు చేస్తున్నారు. ఆయనెవరు, విషయం ఏమిటన్నది మరోసారి మీడియా ముందు చెబుతానని కన్నడ సినిమా హాస్యనటుడు బుల్లెట్ ప్రకాశ్ అన్నారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కన్నడ సినిమా రంగంలో నటుల మధ్య విభేదాలున్నాయని, కొంతమంది గ్రూపులుగా ఏర్పడి సినిమా రంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. -
చంపేస్తామంటూ కమెడియన్‌కు బెదిరింపులు
బెంగళూరు: ప్రముఖ కన్నడ కమెడియన్ బుల్లెట్ ప్రకాశ్ గురువారం పోలీసులను ఆశ్రయించాడు. తనను చంపేస్తామంటూ కన్నడ సూపర్ స్టార్ దర్శన్ కుటుంబం నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరాడు. దర్శన్ సోదరుడు దినకర్ తూగుదీప్ తన కూతురు సమక్షంలోనే తనను చంపేస్తానని బెదిరించాడని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. 'చంపుతానని అతను చేసిన బెదిరింపులకు నా కూతురే ప్రత్యక్ష సాక్షి. అతను మరీ నీచంగా ప్రవర్తించాడు. నాకు పోలీసుల రక్షణ అవసరముంది. తాను చేసిన పోలీసు ఫిర్యాదును వెనుకకు తీసుకోవాలని దర్శన్ అనుచరులను నన్ను వెంటాడి వేధిస్తున్నారు' అని ఆయన తన ఫిర్యాదు పేర్కొన్నాడు. నిజానికి బుల్లెట్ ప్రకాశ్, దర్శన్ మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి అనేక హిట్ సినిమాల్లో నటించారు. దర్శన్ తో కలిసి ఓ సినిమా నిర్మిస్తానని బుల్లెట్ ప్రకాశ్ ఇటీవల ప్రకటించాడు. అయితే ఈ ప్రయత్నం అంతగా సఫలం కాలేదు. దీనిపై దర్శన్ సోదరుడు దినకర్ తో బుల్లెట్ ప్రకాశ్ కు విభేదాలు వచ్చాయి. ఈ విషయమై ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయవద్దని ప్రకాశ్ ను దినకర్ కోరాడు. ఈ వివాదం చినికిచినికి పోలీసు స్టేషన్ దాకా వెళ్లింది. దీంతో తనను చంపేస్తానని దినకర్ బాహాటంగా బెదిరిస్తున్నాడని ప్రకాశ్ చెప్తున్నారు. 2011లో భార్యను కొట్టిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ కొంతకాలంలో జైలులో గడిపారు. ఆ తర్వాత భార్యాభర్తలు రాజీ కుదుర్చుకొని కేసు వాపస్ తీసుకున్నారు.