
బెంగుళూరు: కన్నడ స్టార్ కమెడియన్ బుల్లెట్ ప్రకాశ్ (44) సోమవారం సాయంత్రం మృతి చెందారు. కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జీర్ణ సంబంధమైన సమస్యతో ఆయన మార్చి 31న ఆస్పత్రిలో చేరగా.. కిడ్ని, కాలేయ వ్యాధులు ఉన్నాయని తేలింది. ఈక్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారని ప్రకాశ్ సన్నిహితులు తెలిపారు.
(చదవండి: రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మీ కనకాల మృతి)
కాగా, 300లకు పైగా సినిమాల్లో నటించిన ప్రకాశ్ కన్నడ సినీ రంగంలో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించారు. పునీత్ రాజ్‌కుమార్, దర్శన్, శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, సుదీప్ కిచ్చ వంటి బడా హీరోలతో కలిసి నటించారు. మస్త్ మజా మాది (2008), అయితలకడి (2010), మల్లిఖారుజన (2011), ఆర్యన్ (2014) సినిమాలు ఆయనకు నటుడిగా గుర్తింపు తీసుకొచ్చాయి. ఆయన హావభావాలకు గాను బుల్లెట్ ప్రకాశ్‌గా పేరు స్థిరపడిపోయింది. బిగ్‌బాస్ కన్నడ సీజన్-2లో కూడా ఆయన పాల్గొన్నారు. ప్రకాశ్ బీజేపీ కార్యకర్తగా పనిచేశారు.
(చదవండి: బాలీవుడ్‌లో మరో కరోనా కేసు)
Comments
Please login to add a commentAdd a comment