బెంగళూరులో విషాదం.. మహిళ ప్రాణాలు తీసిన నటుడు! | Kannada actor Nagabhushana Car Accident in Bengaluru A Women Died | Sakshi
Sakshi News home page

Nagabhushana: కారు బీభత్సం.. మహిళ ప్రాణాలు తీసిన నటుడు!

Oct 1 2023 3:59 PM | Updated on Oct 1 2023 5:41 PM

Kannada actor Nagabhushana Car Accident in Bengaluru A Women Died - Sakshi

బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. కన్నడ నటుడు నాగభూషణ కారు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందారు.  ఫుట్‌పాత్‌పై నడుస్తున్న జంటపైకి నాగభూషణ నడుపుతున్న కారు దూసుకెళ్లింది. శనివారం వసంతనగర్ ప్రధాన రహదారి సమీపంలో ఈ సంఘటన జరిగింది. నటుడి కారు మొదట విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి.. ఆ తర్వాత దంపతులపై దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. 

ఇటీవల కౌసల్య సుప్రజా రామ చిత్రంలో కనిపించిన కన్నడ నటుడు నాగభూషణ కర్ణాటకలోని బెంగళూరులో ఫుట్‌పాత్‌పై నడుస్తున్న జంటపైకి తన కారును ఢీకొట్టాడు. ఈ సంఘటన శనివారం రాత్రి 9:45 గంటలకు వసంతనగర్ ప్రధాన రహదారి సమీపంలో నటుడి కారు మొదట విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, ఆపై నడుచుకుంటూ వెళ్తున్న జంటను ఢీకొట్టింది. నటుడు ఉత్తరాహాల్ నుండి కోననకుంటె వైపు వెళ్తున్నట్లు ఇండియా టీవీ రిపోర్టర్ ధృవీకరించారు.

అయితే నాగభూషణం స్వయంగా తానే గాయపడిన దంపతులను ఆస్పత్రికి తరలించాడు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ 48 ఏళ్ల మహిళ మృతి చెందగా.. ఆమె భర్త ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. కాగా..ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు నటుడిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా.. నాగభూషణం  కౌసల్య సుప్రజా రామ చిత్రంలో చివరిసారిగా కనిపించాడు.  ఇక్కత్‌ అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఆయన.. ఈ చిత్రంలో నటనకు  ఉత్తమ డెబ్యూ నటుడిగా అవార్డు లభించింది. బడవ రాస్కెల్‌ అనే మూవీకి ఉత్తమ సహాయ నటుడిగా కూడా ఎంపికయ్యాడు. తెలుగు, తమిళంలో సమంత, ఆది పినిశెట్టి నటించిన  యూ టర్న్ చిత్రంలో ఆటో డ్రైవర్‌గా నటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement