
యశవంతపుర: బుల్లితెర బాలనటి సించన (15) ఆకస్మికంగా మృతి చెందింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో వాంతి, విరేచనలు కావటంతో సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆస్పత్రికి రాకముందే మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సించన చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సించనకు గొంతు వద్ద ఇంజక్షన్ ఇవ్వటంతో రక్తస్రావం ఎక్కువై మృతి చెందినట్లు తల్లి ఆరోపించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు బాగలకుంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.