
నందమూరి తారకరత్నను చూసేందుకు జూ. ఎన్టీఆర్ బెంగళూరు చేరుకున్నారు. కల్యాణ్ రామ్‌తో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితపై వైద్యులను తెలుసుకున్న అనంతరం తారక్ మీడియాతో మాట్లాడారు. 'అన్నయ్య(తారకరత్న) చికిత్సకు స్పందిస్తున్నారు.
ఆయనకు మెరుగైన వైద్యం అందుతోంది. ప్రస్తుతం పోరాడుతున్నారు. క్రిటికల్ కండిషన్ నుంచి బయట పడ్డారని చెప్పలేం. కుటుంబసభ్యుడిగా ఇక్కడికి వచ్చాను. డాక్లర్లు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదం, ప్రార్థనలు అవసరం' అని పేర్కొన్నారు. ఇక కల్యాణ్ రామ్ మాట్లాడుతూ... 'మీ అందరి అభిమానంతో తప్పకుండా తమ్ముడు త్వరగా కోలుకొని మన ముందుకు రావాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నా' అని తెలిపారు.