
నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. 48 గంటల అబ్జర్వేషన్ ముగిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని.. మరిన్ని పరీక్షలు చేసిన తర్వాత స్పష్టత వస్తుందని వైద్యులు తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సోమవారం మధ్యాహ్నం తర్వాత ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు.
తారకరత్నకు కుప్పంలో యాంజియోప్లాస్టీ తర్వాత నారాయణ హృదయాలయలో వైద్యుల బృందం ఆయనకు చికిత్స కొనసాగిస్తోంది. అయితే తారకతరత్నకు ఈరోజు నిర్వహించే వైద్య పరీక్షలు కీలకం కానున్నాయి. ఈరోజు ఆయనకు ఎమ్‌ఆర్‌ఐ(MRI)స్కాన్ తీయనున్నారు. దీని ఆధారంగా ట్రీట్‌మెంట్ కొనసాగించనున్నారు. ఈనెల 27న తారకరత్న గుండెపోటుకు గురికాగా అప్పటి నుంచి పరిస్థితి క్రిటికల్‌గానే ఉంది.
కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ ఆదివారం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఆయన గుండె స్పందన సాధారణంగా ఉన్నా మెదడు పనితీరు సాధారణ స్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు పరీక్షల ద్వారా గుర్తించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment