Kannada film industry
-
ఆరోపణలు నిజమైతే ఐదేళ్లు బహిష్కరణ
నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమా కమిటీ ప్రభావం ఇతర ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది. దీంతో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం చెన్నైలోని ఆ సంఘం నిర్వాహకుల సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. ఇందులో ముఖ్యంగా విశాఖ కమిటీ సూచనల మేరకు నటీమణుల రక్షణ కోసం ఎస్ఐఏఏ–జీఎస్ఐసీసీ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. దీనికి నటి రోహిణి అధ్యక్షురాలిగానూ, నటీమణులు సుహాసిని, ఖుష్బూ సభ్యులుగానూ వ్యవహరిస్తారు. ఈ కమిటీకి ఒక న్యాయవాదిని నియమించనున్నారు. నటీమణులపై లైంగిక వేధింపులు రుజువైతే అందుకు కారణమైన వారిని సినిమాల నుంచి 5 ఏళ్లు బహిష్కరించాలని నిర్మాతల మండలికి సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా బాధిత నటీమణులకు చట్టపరంగా సహాయాలను అందించడం జరుగుతుందన్నారు. అలాగే బాధితుల ఫిర్యాదుల కోసం ఇప్పటికే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశామనీ, తాజాగా ఈమెయిల్ ద్వారానూ ఫిర్యాదులు చేయవచ్చనీ తీర్మానం చేశారు. కాగా యూట్యూబ్ ఛానల్స్ కారణంగా బాధితులైనవారు సైబర్ ΄ోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ కమిటీ వారికి సహకరిస్తుందని, కమిటీ చర్యలను నటీనటుల సంఘం పర్యవేక్షిస్తుందని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ఉ΄ాద్యక్షుడు పూచి మురుగన్, కోశాధికారి కార్తీ ΄ాల్గొన్నారు. -
ఓ ప్రత్యేక ఈవెంట్లో పునీత్ రాజ్ కుమార్ వేడుకలు.. ఎప్పుడంటే..?
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వేడుకలను ఒక ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహించబోతున్నారు. కన్నడ సినీ పరిశ్రమ, కర్ణాటకలోని రాజకీయ నాయకులు దివంగత నటుడి వేడుకలను నవంబర్ 16న జరపనున్నారు. ఈ రోజంతా కన్నడ చిత్ర పరిశ్రమ రోజంతా మూసివేస్తారు. 3 గంటలపాటు జరిగే ఈ ఈవెంట్లో ఎవరెవరూ హాజరవుతాలో చూడాలి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ)తో పాటు శాండల్ వుడ్ ఫిల్మ్ నటీనటులు, సాంకేతిక నిపుణుల సంఘాలు 'పునీత్ నామన' పేరుతో ఈ వేడుకలను నిర్వహించనున్నాయి. అయితే కొవిడ్ కారణంగా అతిథుల జాబితాలో పరిమితులు ఉండనున్నట్లు సమాచారం. నిర్వాహకులు పొరుగు రాష్ట్రాలు, వారి చిత్ర పరిశ్రమ, ఛాంబర్ల నుంచి సభ్యులను కూడా ఆహ్వానించారు. పలు నివేదికల ప్రకారం ఈ కార్యక్రమానికి 1500 మంది హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నాయకులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. కన్నడ సినీ పరిశ్రమ సభ్యులు పునీత్ రాజ్‌కుమార్‌కు ప్రత్యేక నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి నాగేంద్ర ప్రసాద్ రచించగా, గురుకిరణ్ స్వరపరచిన ప్రత్యేక గీతాన్ని ఆలపించనున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మరణించినప్పటి నుంచి ప్రతిరోజూ దాదాపు 30,000 మంది అభిమానులు ఆయన స్మారకాన్ని సందర్శిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో కన్నడ నాట విషాదఛాయలు అలుముకున్నాయి. -
కన్నడ స్టార్ యశ్ భారీ విరాళం
లాక్డౌన్ వల్ల ఎంతోమంది జీవితాలు రోడ్డున పడ్డాయి. బయటకు రంగులమయంగా కనిపించే ఇండస్ట్రీ మీద కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. షూటింగ్‌లు జరిగేతే కానీ పట్టెడన్నం దొరకని చిన్నాచితకా సినీకార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు రంగం సిద్ధం చేశాడు కన్నడ స్టార్ యశ్. కన్నడ చిత్రపరిశ్రమలోని సినీకార్మికుల కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. మూడు వేల మంది కార్మికులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు 1.5 కోట్లు విరాళంగా ఇస్తూ మంచి మనసు చాటుకున్నాడు. "కరోనా వైపరీత్యం వల్ల కన్నడ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. చిత్రరంగంలోని 21 విభాగాలకు చెందిన మూడు వేలమందికి తలా 3,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను ఆర్జించిన సంపాదనలో నుంచి ఇస్తున్నాను. ఈ చిన్నపాటి ఆర్థిక సాయం వారికి శాశ్వత పరిష్కారం చూపించకపోవచ్చు. కానీ మళ్లీ మంచి రోజులు వస్తాయని నమ్మకంతో ఉందాం" అంటూ ఓ ప్రకటన విడుదల చేశాడు. యశ్ తీసుకున్న నిర్ణయాన్ని అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్నావ్ అంటూ కీర్తిస్తున్నారు. #togetherwestand #humanity pic.twitter.com/46FYT9pThz — Yash (@TheNameIsYash) June 1, 2021 చదవండి: KGF Chapter 2 : అరుదైన రికార్డు సాధించిన ‘రాఖీ భాయ్’ -
శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఆఫ్రికన్ అరెస్టు
బెంగళూరు: కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగంపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు శనివారం ఈ కేసులో ఆఫ్రికా దేశం సెనెగల్ కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. లౌమ్ పెప్పర్ సాంబా అనే ఇతడు సెలబ్రిటీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నటి రాగిణి ద్వివేదిని సహా మొత్తం ఆరుగురు ఇప్పటికే అరెస్టయ్యారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద మొత్తం 12 మందిపై కేసులు నమోదయ్యాయి. రాగిణిని శుక్రవారం అరెస్టు చేయగా, జయనగర్ ఆర్టీవోలో క్లర్క్‌గా పనిచేస్తున్న రవిశంకర్, రియల్టర్ రాహుల్ షెట్టిలను గురువారం అరెస్టు చేశారు. ఉన్నతవర్గాల పార్టీలను నిర్వహించే వీరేన్ ఖన్నాను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ డీలర్ సాంబా... రవిశంకర్‌కు, సెలబ్రిటీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడని సీసీబీ పోలీసులు తెలిపారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇటీవల బెంగళూరులో కొన్ని అరెస్టులు చేíసినప్పుడు... కన్నడ నటులు, సంగీతకారులతో డ్రగ్ డీలర్లకు ఉన్న సంబంధాలు వెలుగు చూశాయి. నటి రాగిణిని అరెస్టు చేయడం ప్రకంపనలు రేపింది. కొందరు బడా నేతల కుమారుల ప్రమేయం ఉండటంతో ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
కన్నడ స్టార్స్.. కరోనా పాట
కరోనా మీద అవగాహన పెంచేందుకు, పోరాటానికి కావాల్సిన స్ఫూర్తిని అందిస్తూ ప్రతీ ఇండస్ట్రీకు సంబంధించిన స్టార్స్ కరోనాకు సంబంధించిన పాటలను విడుదల చేస్తున్నారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీ కూడా కరోనా పై ఓ ప్రత్యేక గీతాన్ని తయారుచేసింది. ఈ పాట నేడు (మే 25) విడుదల కానుంది. కన్నడ దర్శకుడు పవన్ వడియార్ ఈ పాటకు సంబంధించిన కాన్సెప్ట్‌ను రెడీ చేశారు. హరికిషన్ స్వరపరిచిన ఈ పాటను ప్రథ్యుమ్న రాశారు. విజయ్ ప్రకాష్, రాజేశ్ ఆలపించారు. ఈ పాటలో కన్నడ స్టార్స్ ఉపేంద్ర, పునీత్ రాజ్ కుమార్, శివరాజ్‌కుమార్, సుమలత అంబరీష్, దర్షన్, రమేష్ అరవింద్, రవిచంద్రన్, రక్షిత్ శెట్టి, శాన్వీ, అభిషేక్ అంబరీష్‌తో పాటు మిగత స్టార్స్ కూడా కనిపించనున్నారు. క్రికెట్ స్టార్ అనిల్ కుంబ్లే కూడా ఈ పాటలో కనిపిస్తారట. ఎనిమిది నిమిషాల పాటు సాగే ఈ పాటలో కనిపించే స్టార్స్ అందరూ ఎవరింట్లో వారు ఉండి ఈ పాటను షూట్ చేశారట. -
స్టార్ కమెడియన్ మృతి
బెంగుళూరు: కన్నడ స్టార్ కమెడియన్ బుల్లెట్ ప్రకాశ్ (44) సోమవారం సాయంత్రం మృతి చెందారు. కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జీర్ణ సంబంధమైన సమస్యతో ఆయన మార్చి 31న ఆస్పత్రిలో చేరగా.. కిడ్ని, కాలేయ వ్యాధులు ఉన్నాయని తేలింది. ఈక్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారని ప్రకాశ్ సన్నిహితులు తెలిపారు. (చదవండి: రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మీ కనకాల మృతి) కాగా, 300లకు పైగా సినిమాల్లో నటించిన ప్రకాశ్ కన్నడ సినీ రంగంలో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించారు. పునీత్ రాజ్‌కుమార్, దర్శన్, శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, సుదీప్ కిచ్చ వంటి బడా హీరోలతో కలిసి నటించారు. మస్త్ మజా మాది (2008), అయితలకడి (2010), మల్లిఖారుజన (2011), ఆర్యన్ (2014) సినిమాలు ఆయనకు నటుడిగా గుర్తింపు తీసుకొచ్చాయి. ఆయన హావభావాలకు గాను బుల్లెట్ ప్రకాశ్‌గా పేరు స్థిరపడిపోయింది. బిగ్‌బాస్ కన్నడ సీజన్-2లో కూడా ఆయన పాల్గొన్నారు. ప్రకాశ్ బీజేపీ కార్యకర్తగా పనిచేశారు. (చదవండి: బాలీవుడ్లో మరో కరోనా కేసు) -
ఉరి వేసుకుని ఆత్మహత్య
-
కన్నడకు స్వాగతం!
ఏ ఇండస్ట్రీలో అయినా, తొలి పరిచయం ఒక్కసారే జరుగుతుంది. కానీ ఫిల్మ్ఇండస్ట్రీలోనే తొలి పరిచయం పలుసార్లు జరిగే అవకాశం వస్తుంది. ఒక ఇండస్ట్రీలో స్టార్స్ మరో ఇండస్ట్రీలోకి పరిచయం అవడం ఫస్ట్ టైమ్ అన్నట్లేగా. తాజాగా బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ కన్నడ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా ‘యువరత్న’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ద్వారా కన్నడ ప్రేక్షకులను పలకరించడానికి ఇరానీ రెడీ అయ్యారని సమాచారం. సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. ఆల్రెడీ ‘అత్తారింటికి దారేది, బెంగాల్ టైగర్’ సినిమాలతో బోమన్ ఇరానీ తెలుగులో కనిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
కన్నడ దాడుల్లో 11 కోట్ల ఆస్తులు లభ్యం
బెంగళూరు: కన్నడ సినీ ప్రముఖుల నివాసాల్లో చేపట్టిన సోదాల్లో రూ. 11 కోట్ల విలువైన ఆస్తులు, నగదు లభ్యమైనట్లు ఆదాయ పన్ను అధికారులు వెల్లడించారు. అలాగే, లెక్కల్లో చూపని రూ.109 కోట్ల ఆదాయాన్ని కలిగి ఉన్నట్లు కూడా నిందితులు అంగీకరించినట్లు తెలిపారు. నటులు శివరాజ్ కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుదీప్, యశ్, నిర్మాతలు సీఆర్ మనోహర్, రాక్‌లైన్ వెంకటేశ్, విజయ్ కిరిగందూర్ ఇళ్లపై గురువారం నుంచి శనివారం వరకు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ వివరాల్ని అధికారులు ఆదివారం మీడియాకు వెల్లడించారు. పట్టుబడిన రూ.11 కోట్ల ఆస్తుల్లో రూ.2.85 కోట్ల నగదు, 25.3 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు చెప్పారు. తమకు దొరికిన ఆధారాల్ని రెవెన్యూ, ఇతర విచారణ సంస్థలకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. కర్ణాటక, గోవాలో పనిచేస్తున్న 180 మంది అధికారులు మొత్తం 26 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. -
కన్నడ హీరోలకు ఐటీ షాక్
సాక్షి, బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇళ్లలో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ గురువారం భారీ ఎత్తున దాడులు నిర్వహించింది. నలుగురు పెద్ద హీరోలు, ముగ్గురు బడా నిర్మాతల ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి. ఇటీవల కాలంలో కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందాయి. అందులో కొన్ని సక్సెస్ సాధించి బడా నిర్మాతలకు, హీరోలకు కోట్ల రాబడి తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేత ఆరోపణలు పెరగడంతో ఐటీ శాఖ సోదాలు ప్రారం భించింది. కర్ణాటకలోని సుమారు 23 ప్రాంతా ల్లో 200 మంది ఐటీ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. ప్రముఖ శాండల్‌వుడ్ హీరోలు శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుదీప్, యశ్, ప్రముఖ నిర్మాతలు రాక్‌లైన్ వెంకటేశ్, సీఆర్ మనోహర్, విజయ్ కిరంగదూరు ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఐటీ అధికారులు నగదు, కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏకకాలంలో వేర్వేరుగా సోదాలు ఉదయం 7 గంటల నుంచే ఏకకాలంలో ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు చేపట్టారు. సదాశివనగరలోని పునీత్ రాజ్‌కుమార్ ఇల్లు, మాన్యత టెక్‌పార్కు దగ్గర్లో పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ ఇల్లు, కేజీఎఫ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యశ్ ఇల్లు, తెలుగులో ‘ఈగ’సినిమా విలన్ కిచ్చ సుదీప్ ఇంట్లో సోదాలు చేశారు. కేజీఎఫ్ చిత్ర నిర్మాతలు విజయ్ కిరంగదూరు, రాక్‌లైన్ వెంకటేశ్, నిర్మాత, జేడీఎస్ ఎమ్మెల్సీ సీఆర్ మనోహర్ నివాసాల్లో కొన్ని డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ ప్రముఖులు నటించిన, నిర్మించిన సినిమాలు, వాటి బడ్జెట్, కలెక్షన్స్ వివరాలను అధికారులు సేకరించారు. కర్ణాటక సీఎం కుమారస్వామి రెండో భార్య, నటి రాధిక ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారని వార్తలు వినిపించాయి. ఐటీ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. తమిళనాట ప్రముఖ హోటళ్లపైనా... సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున వ్యాపారాలు చేస్తున్న హోటల్ శరవణ భవన్, అంజప్పర్ హోటల్స్, గ్రాండ్ స్వీట్స్, హాట్ బ్రెడ్ తదితర వ్యాపార సంస్థలకు చెందిన 32 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటళ్లపై కేంద్రం జీఎస్టీని తగ్గించినా వినియోగదారుల నుంచి పాత జీఎస్టీనే వసూలు చేస్తున్నారని, కొత్త ఏడాది సందర్భంగా పెద్ద ఎత్తున తినుబండారాల అమ్మకాలు జరిగినా తక్కువ అయినట్లుగా లెక్కలు రాసినట్లు ఐటీశాఖకు సమాచారం అందింది. దీంతో ఐటీ సిబ్బంది సోదాలు చేపట్టింది. -
సీఎం భార్య ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, బెంగళూరు/చెన్నై: కర్ణాటకలో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం ఏకకాలంలో 60 ప్రాంతాలలో దాడులకు దిగడం సంచలనం సృష్టించింది. ప్రధానంగా సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రెండో భార్య రాధిక, సినీ దిగ్గజ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌కుమార్ కుమారులు శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ నివాసాల్లో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. వీరితోపాటు పలువురు నటులు, నిర్మాతల నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో ఐటీ దాడులు నిర్వహించింది. హీరో సుదీప్, ‘కేజీఎఫ్’ నటుడు యశ్, ఈ సినిమా నిర్మాత విజయ్ ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్షసాధింపుతోనే కుమారస్వామి భార్య రాధిక నివాసంలో ఐటీ దాడులు చేపట్టారని జేడీ(ఎస్) నాయకులు ఆరోపిస్తున్నారు. చెన్నైలోనూ ఐటీ దాడులు తమిళనాడు రాజధాని చెన్నైలోని పలు ప్రముఖ హోటళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. 32 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. పన్ను ఎగవేత కారణంతో శరవణభవన్, అంజప్పార్ తదితర ప్రముఖ హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. -
న్యాయం కోసం!
మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు కన్నడ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. అక్కడ న్యాయం కోసం పోరాడుతున్నారు. అయ్యో.. ఏమంత కష్టం వచ్చిపడింది అనుకుంటున్నారా? మరేం లేదు. బాధితుల తరఫున న్యాయం కోసం పోరాడే లాయర్‌గా ఆమె ‘నటసార్వభౌమ’ అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. పవన్ వడయార్ దర్శకత్వంలో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. కలకత్తా, బెంగళూరులో ఈ సినిమా మేజర్ షూటింగ్‌ను ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో అనుపమ లుక్కు సంబంధించిన ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఇక తెలుగులో ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాలో అనుపమ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ హీరోగా నక్కిన త్రినా«థరావు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఘనంగా చిరంజీవి సర్జా, మేఘన నిశ్చితార్థం
శాండిల్‌వుడ్‌కు చెందిన మరో జంట పెళ్ళి పీటలు ఎక్కడానికి సిద్ధమైంది. వెండితెరపై హీరో హీరోయిన్లుగా రొమాన్స్ పండించిన జంటలు నిజ జీవితంలోనూ సంసార బంధంతో ఒక్కటి కాబోతున్నాయి. ఈ ట్రెండ్ ఇటీవలి కాలంలో బాగా పెరగడం విశేషం. సాక్షి, బెంగళూరు : కన్నడ నటుడు చిరంజీవి సర్జా, నటి మేఘనా రాజ్‌ల నిశ్చితార్థం ఆదివారం బెంగళూరు జేపీనగరలో ఉన్న మేఘనారాజ్ నివాసంలో సంప్రదాయబద్ధంగా జరిగింది. నటుడు, దర్శకుడు అయిన అర్జున్సర్జాతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి సర్జా కాబోయే వధువు మేఘనారాజ్ ఇంటికి వచ్చారు. అర్జున్సర్జా భార్య ఆశారాణి, పిల్లలు ఐశ్వర్య సర్జా, ధృవసర్జాతో పాటు కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. చిరంజీవి సర్జా కుటుంబ సభ్యులకు మేఘనా ఇంట్లోకి పూలహారం వేసి స్వాగతం పలికారు. హిందూ సంప్రదాయంలో కొత్త జంట ఉంగరాలు మార్చుకున్నారు. మేఘనారాజ్ ఎరువు రంగు చీరలో, చిరు సర్జా వైట్ షర్ట్, వైట్ పంచలో కనిపించారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు బెంగళూరు నగరంలో ఉన్నలీలా ప్యాలెస్‌లో బంధువులు, సన్నిహితులతో విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో గులాబీ రంగులో గౌనులో మేఘనా, నీలం రంగు లైట్ చెక్స్ ఉన్న షర్ట్‌లో చిరు దర్శనమిచ్చారు. ఉభయులూ నట ప్రముఖులే సీనియర్ సినీనటులైన సుందర్రాజ్, ప్రమీలా జోషాయ్ దంపతుల కుమార్తె అయిన మేఘనారాజ్.. పుండ అనే కన్నడ సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. మలయాళం సినిమాల్లో మంచి పేరును తెచ్చుకోవడం జరిగింది, తెలుగు, తమిళ సినిమాల్లో కూడా సినిమాల్లో నటించారు. కన్నడలో రాకింగ్ స్టార్ యశ్‌తో నటించిన రాజాహులి సినిమా ద్వారా మేఘనారాజ్కు మంచి పేరు సంపాదించారు. బహుపరాక్, లక్ష్మణ, అల్లమ యశస్వీ తదితర సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటించారు. ఆటగార సినిమాలో మేఘనారాజ్, చిరంజీవి సర్జా ఇద్దరు జంటగా నటించడం విశేషం. ప్రముఖ నటుడు అర్జున్సర్జా సోదరి కుమారుడే చిరంజీవి సర్జా. వాయుపుత్ర సినిమా ద్వారా కన్నడ సినిమాల్లోకి అడుగు పెట్టిన చిరు సర్జా, అనంతరం గండెదె, చిరు, దండం దశగుణం, వదర నాయక, రుద్రతాండవ తదితర పలు కన్నడ సినిమాల్లో హీరోగా నటించారు. -
ఇంటి వాడు కానున్న యశ్
బెంగళూరు: శాండల్‌వుడ్‌లో హిట్ పెయిర్‌గా పేరుగాంచిన యశ్, రాధికా పండిట్లు వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో రేపు(ఆగస్ట్12) ఉదయం పది గంటలకు వీరిద్దరి నిశ్చితార్థం గోవాలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబానికి ఆప్తులైన వారిని మాత్రమే ఆహ్వానించినట్లు యశ్ తెలపారు. కాగా వీరిద్దరు నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం విధితమే. కాగా ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరువురు దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతుండడం ఆనందంగా ఉందని శాండల్ఉడ్లోని పలువురు ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరన వీరిద్దరి వివాహం జరగనుందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
శాండల్‌వుడ్ నటుడు రఘువీర్ కన్నుమూత...
సాక్షి, బెంగళూరు : కన్నడ సినీ రంగంలో 22ఏళ్ల పాటు ప్రయాణాన్ని సాగించిన నటుడు రఘువీర్(46) మృతిచెందారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. అజయ్-విజయ్ చిత్రంతో శాండిల్‌వుడ్‌కు పరిచయమైన రఘువీర్ అసలు పేరు దినేష్. చైత్రద ప్రేమాంజలి సినిమా ఆయనకు మంచి నటుడిగా పేరు తెచ్చింది. ‘శృంగార కావ్య’ సినిమాలో తనతో పాటే నటించిన హీరోయిన్ సింధును రఘువీర్ వివాహమాడారు. ఈ వివాహం రఘువీర్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో కుటుంబానికి ఆయన దూరమయ్యారు. వివాహమైన కొన్ని సంవత్సరాలకు అనారోగ్య కారణంగా భార్య సింధు మరణించడంతో మానసికంగా కుంగిపోయిన రఘువీర్ చాలా కాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇటీవల తిరిగి వచ్చి కావేరీ తీరదల్లి, నవిలూర నైదిల, మౌన సంగ్రామ వంటి సినిమాలు చేసినా అవి నిరాశనే మిగిల్చాయి. గురువారం రాత్రి తన స్నేహితులు, పిల్లలతో కలిసి ఎస్టేట్‌కి వెళుతున్న సమయంలో ఉన్నపళంగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తక్షణమే ఆయన్ను బీటీఎం లేఅవుట్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించినా చికిత్స ఫలించక తనువు చాలించారు. సంపంగి రామనగరలోని రఘువీర్ నివాసంలో ప్రజల సందర్శనార్ధం పార్ధివ దేహాన్ని ఉంచారు. నటీనటులు శోభరాజ్, లీలావతి, వినోద్‌రాజ్, కె.మంజు, జగ్గేష్ తదితరులు రఘువీర్ పార్ధివ శరీరానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం విల్సన్ గార్డెన్ స్మశాన వాటికలో రఘువీర్ అంత్యక్రియలు పూర్తిచేశారు. రఘువీర్ కుటుంబానికి రూ1.75లక్షల ధన సహాయాన్ని అందించనున్నట్లు కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి వెల్లడించింది. -
డబ్బింగ్‌ను అనుమతిస్తే తప్పేంటి ?
వేరే భాషల సినిమాల ద్వారా ఇతరుల సంస్కృతిని తెలుసుకోవచ్చు ‘డబ్బింగ్’పై చర్చా కార్యక్రమంలో అగ్ని శ్రీధర్ సాక్షి, బెంగళూరు : కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్‌ను అనుమతిస్తే తప్పేంటని న్యాయక్కాగి నావు సంస్థ వ్యవస్థాపకులు అగ్ని శ్రీధర్ ప్రశ్నించారు. కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్‌ను అనుమతించరాదంటూ శాండల్‌వుడ్ కళాకారులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ఇతర సామాజిక సంస్థల ప్రతినిధులతో కలిసి ‘న్యాయక్కాగి నావు’ సంస్థ ఆధ్వర్యంలో శనివారమిక్కడ ‘డబ్బింగ్’పై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని శ్రీధర్ మాట్లాడుతూ...కన్నడ సినీ పరి శ్రమలోకి డబ్బింగ్‌ను అనుమతించడం ద్వారా కన్నడ భాష, సంస్కృతితో పా టు కళాకారులకు ఎటువంటి అన్యాయ ం జరగదని అన్నారు. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారు తూ పోవాలని, ఇతర భాషలను కన్నడలోకి డబ్ చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల సంస్కృతి గురించి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నా రు. అంతేకాక ఇతర భాషలకు చెందిన సినిమాల్లో ఉపయోగించిన సరికొత్త టెక్నాలజీ, నటుల ప్రతిభను గురించి కూడా కర్ణాటక ప్రజలు తెలుసుకోవచ్చని చెప్పారు. అనంతరం సాహితీవేత్త ఇందూధర హున్నాపుర మాట్లాడుతూ... కళాకారులు, నటీనటులు సాంస్కృతిక రాయబారులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అ యితే కొంతమంది కళాకారులు మాత్ర ం గూండా ల్లా మాట్లాడడం, ప్రవర్తించ డం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశా రు. కన్నడ భాషపై ఎంతో మమకారాన్ని చూపుతున్నామని చెప్పుకునే శాండల్‌వుడ్ కళాకారుల్లో ఎంతమంది తమ తమ పిల్లలను కన్నడ మాధ్యమంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా డెరైక్టర్ సురేష్ డబ్బింగ్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. వినోదం అనేది పూర్తి స్థాయిలో వ్యాపారంగా మారిపోకూడదనే ఉద్దేశంతోనే డబ్బింగ్‌ను విరోధిస్తున్నామని చెప్పారు. డబ్బింగ్‌ను అడ్డం పెట్టుకొని కన్నడ సినీ పరిశ్రమలోకి ప్రవేశించాలని అనేక అంతర్జాతీయ సంస్థలు భావిస్తున్నాయని పేర్కొన్నారు. అదే కనుక జరిగితే శాండల్‌వుడ్ పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటుందని చెప్పారు. చర్చా కార్యక్రమంలో రైతు నాయకుడు, ఎమ్మెల్యే కె.ఎస్.పుట్టణ్ణయ్య పాల్గొన్నారు.