- వేరే భాషల సినిమాల ద్వారా ఇతరుల సంస్కృతిని తెలుసుకోవచ్చు
- ‘డబ్బింగ్’పై చర్చా కార్యక్రమంలో అగ్ని శ్రీధర్
సాక్షి, బెంగళూరు : కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్‌ను అనుమతిస్తే తప్పేంటని న్యాయక్కాగి నావు సంస్థ వ్యవస్థాపకులు అగ్ని శ్రీధర్ ప్రశ్నించారు. కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్‌ను అనుమతించరాదంటూ శాండల్‌వుడ్ కళాకారులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ఇతర సామాజిక సంస్థల ప్రతినిధులతో కలిసి ‘న్యాయక్కాగి నావు’ సంస్థ ఆధ్వర్యంలో శనివారమిక్కడ ‘డబ్బింగ్’పై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అగ్ని శ్రీధర్ మాట్లాడుతూ...కన్నడ సినీ పరి శ్రమలోకి డబ్బింగ్‌ను అనుమతించడం ద్వారా కన్నడ భాష, సంస్కృతితో పా టు కళాకారులకు ఎటువంటి అన్యాయ ం జరగదని అన్నారు. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారు తూ పోవాలని, ఇతర భాషలను కన్నడలోకి డబ్ చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల సంస్కృతి గురించి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నా రు. అంతేకాక ఇతర భాషలకు చెందిన సినిమాల్లో ఉపయోగించిన సరికొత్త టెక్నాలజీ, నటుల ప్రతిభను గురించి కూడా కర్ణాటక ప్రజలు తెలుసుకోవచ్చని చెప్పారు.
అనంతరం సాహితీవేత్త ఇందూధర హున్నాపుర మాట్లాడుతూ... కళాకారులు, నటీనటులు సాంస్కృతిక రాయబారులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అ యితే కొంతమంది కళాకారులు మాత్ర ం గూండా ల్లా మాట్లాడడం, ప్రవర్తించ డం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశా రు. కన్నడ భాషపై ఎంతో మమకారాన్ని చూపుతున్నామని చెప్పుకునే శాండల్‌వుడ్ కళాకారుల్లో ఎంతమంది తమ తమ పిల్లలను కన్నడ మాధ్యమంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా డెరైక్టర్ సురేష్ డబ్బింగ్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడారు.
వినోదం అనేది పూర్తి స్థాయిలో వ్యాపారంగా మారిపోకూడదనే ఉద్దేశంతోనే డబ్బింగ్‌ను విరోధిస్తున్నామని చెప్పారు. డబ్బింగ్‌ను అడ్డం పెట్టుకొని కన్నడ సినీ పరిశ్రమలోకి ప్రవేశించాలని అనేక అంతర్జాతీయ సంస్థలు భావిస్తున్నాయని పేర్కొన్నారు. అదే కనుక జరిగితే శాండల్‌వుడ్ పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటుందని చెప్పారు. చర్చా కార్యక్రమంలో రైతు నాయకుడు, ఎమ్మెల్యే కె.ఎస్.పుట్టణ్ణయ్య పాల్గొన్నారు.