కరోనా మీద అవగాహన పెంచేందుకు, పోరాటానికి కావాల్సిన స్ఫూర్తిని అందిస్తూ ప్రతీ ఇండస్ట్రీకు సంబంధించిన స్టార్స్ కరోనాకు సంబంధించిన పాటలను విడుదల చేస్తున్నారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీ కూడా కరోనా పై ఓ ప్రత్యేక గీతాన్ని తయారుచేసింది. ఈ పాట నేడు (మే 25) విడుదల కానుంది. కన్నడ దర్శకుడు పవన్ వడియార్ ఈ పాటకు సంబంధించిన కాన్సెప్ట్‌ను రెడీ చేశారు.
హరికిషన్ స్వరపరిచిన ఈ పాటను ప్రథ్యుమ్న రాశారు. విజయ్ ప్రకాష్, రాజేశ్ ఆలపించారు. ఈ పాటలో కన్నడ స్టార్స్ ఉపేంద్ర, పునీత్ రాజ్ కుమార్, శివరాజ్‌కుమార్, సుమలత అంబరీష్, దర్షన్, రమేష్ అరవింద్, రవిచంద్రన్, రక్షిత్ శెట్టి, శాన్వీ, అభిషేక్ అంబరీష్‌తో పాటు మిగత స్టార్స్ కూడా కనిపించనున్నారు. క్రికెట్ స్టార్ అనిల్ కుంబ్లే కూడా ఈ పాటలో కనిపిస్తారట. ఎనిమిది నిమిషాల పాటు సాగే ఈ పాటలో కనిపించే స్టార్స్ అందరూ ఎవరింట్లో వారు ఉండి ఈ పాటను షూట్ చేశారట.
Comments
Please login to add a commentAdd a comment