![ఇంటి వాడు కానున్న యశ్](/styles/webp/s3/article_images/2017/09/4/61470896715_625x300.jpg.webp?itok=h6vhzaqB)
ఇంటి వాడు కానున్న యశ్
బెంగళూరు: శాండల్‌వుడ్‌లో హిట్ పెయిర్‌గా పేరుగాంచిన యశ్, రాధికా పండిట్‌లు వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో రేపు(ఆగస్ట్12) ఉదయం పది గంటలకు వీరిద్దరి నిశ్చితార్థం గోవాలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబానికి ఆప్తులైన వారిని మాత్రమే ఆహ్వానించినట్లు యశ్ తెలపారు. కాగా వీరిద్దరు నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం విధితమే.
కాగా ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరువురు దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతుండడం ఆనందంగా ఉందని శాండల్‌ఉడ్‌లోని పలువురు ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరన వీరిద్దరి వివాహం జరగనుందని కుటుంబ సభ్యులు తెలిపారు.