
కేజీయఫ్ సీక్వెల్‌తో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్శించాడు కన్నడ రాక్‌స్టార్ యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీయఫ్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 2 వేయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో యశ్ రాఖీ భాయ్ అనే మైనింగ్ స్మగ్లర్‌గా కనిపించాడు. ఇందులో పలు సన్నివేశాల్లో తనిన తాను బ్యాడ్ బాయ్‌గా యశ్ చెప్పుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: నటుడితో డేటింగ్, సీక్రెట్‌గా నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్
ఇదిలా ఉంటే తాజాగా ‘డాడీ బ్యాడ్ బాయ్’ అంటూ యశ్ తనయుడు అంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం యశ్ విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్లో పిల్లలతో సరదగా గడుపుతున్నాడు. కూతురు ఐరా, కుమారుడు యథర్వ్‌తో కలిసి సరదగా ఆడుకుంటున్న ఫొటోలు, వీడియోలను తరచూ ఆయన భార్య రాధిక పండిట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ మురిసిపోతుంది. ఇప్పుడు తాజాగా తనయుడు యథర్వ్ క్యూట్ వీడియో ఒకటి పంచుకుంది. ఇందులో తనయుడిని యశ్ ఏడిపించినట్టుగా ఉన్నాడు.
చదవండి: వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, కోర్టు నోటీసులు
యశ్‌ను యథర్వ్ బ్యాడ్ బాయ్ అంటుంటే లేదు గుడ్ బాయ్ అంటూ కొడుకుతో వాదిస్తుంటాడు ‘రాఖీ భాయ్’. అయినా యథర్వ్ డాడీ బ్యాడ్ బాయ్ అంటుంటాడు. లేదు డాడీ గుడ్ అని యశ్ అంటుంటే ‘నో డాడీ బ్యాడ్.. మిమ్మి గుడ్’ అంటూ యథర్వ్ ఏడుస్తూ క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతున్న వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పోస్ట్ నెటిజ్లను రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘యథర్వ్ అమ్మ కొడకు’, ‘యథర్వ్ సో క్యూట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కేజీయఫ్ చిత్రంలోని రాఖీ భాయ్ డైలాగ్‌ను ఈ సందర్భంగా ఈ సంఘటనకు ఆపాదిస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇక యశ్ ఫ్యాన్స్ ఈ వీడియోను పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment