KGF Star Yash, Wife Radhika Pandit Blessed With Baby Boy | జూనియర్‌ యశ్‌ వచ్చేశాడు! - Sakshi
Sakshi News home page

జూనియర్‌ యశ్‌ వచ్చేశాడు!

Published Wed, Oct 30 2019 10:45 AM | Last Updated on Wed, Oct 30 2019 11:09 AM

KGF Star Yash And Radhika Pandit Blessed With Baby Boy - Sakshi

కేజీఎఫ్‌ స్టార్‌, కన్నడ హీరో యశ్‌ రెండోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య, హీరోయిన్‌ రాధికా పండిట్‌ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో బుధవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సాండల్‌వుడ్‌ స్టార్‌ కపుల్‌కు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘జూనియర్‌ యశ్‌ వచ్చేశాడు’ అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు. కాగా ఈ జంటకు ఇప్పటికే ఐరా(11 నెలలు) అనే ఆడబిడ్డ ఉన్న సంగతి తెలిసిందే. 

ఇక పలుచిత్రాల్లో కలిసి నటించిన యశ్‌- రాధిక 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన యశ్‌ గతేడాది విడుదలైన కేజీఎఫ్‌ సినిమాతో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కన్నడతో పాటు వివిధ భాషల్లో రిలీజైన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించడంతో పాటుగా దేశ వ్యాప్తంగా యశ్‌కు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ కేజీఎఫ్‌-2 తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్‌ ఖల్‌నాయక్‌ సంజయ్‌ దత్‌ విలన్‌గా కనిపించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement