సంపాదన గురించి అడగదు, కానీ ఒక్క ప్రశ్న మాత్రం..: యష్‌ | Yash Says Wife Radhika Pandit Never Asks How Much Money he Makes | Sakshi
Sakshi News home page

Yash: రాధిక నా సంపాదనను పట్టించుకోదు, కానీ ఎప్పుడూ ఒక్క ప్రశ్న..

Published Wed, Oct 23 2024 4:35 PM | Last Updated on Wed, Oct 23 2024 5:03 PM

Yash Says Wife Radhika Pandit Never Asks How Much Money he Makes

కేజీఎఫ్‌ సినిమాతో కన్నడ హీరో యష్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ప్రస్తుతం ఇతడు టాక్సిక్‌ : ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. అలాగే భార్య రాధికతో తన అనుబంధం ఎలా ఉంటుందన్నది వెల్లడించాడు.

నా అదృష్టం
రాధిక నా జీవిత భాగస్వామిగా దొరకడం నా అదృష్టం. తనే నా బలం. ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా నిలబడుతుంది. నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటుంది. మొదట తనను స్నేహితురాలిగా చూశాను. తర్వాత భార్యగా స్వీకరించాను. నాకు ఏది నచ్చుతుంది? ఏంటనేది అన్నీ తనకు బాగా తెలుసు. అలాగే ఏదైనా సినిమా చేసినప్పుడు నా రెమ్యునరేషన్‌ ఎంత? ఫలానా మూవీ వల్ల ఎంత డబ్బు వస్తుంది? ఎంత సంపాదిస్తున్నావ్‌? వంటి ప్రశ్నలు వేయదు.

ఒకే ఒక్కే ప్రశ్న
కేవలం ఒకే ఒక్కే ప్రశ్న అడుగుతుంది.. నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అని! తనతో, కుటుంబంతో గడిపేందుకు కొంత సమయం కేటాయించమని చెప్తూ ఉంటుంది. కానీ ఆ టైమే నాకు పెద్దగా దొరకదు. అయినా సరే నావంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నా ప్యాషన్‌ (సినిమా) కోసం ఏం చేయడానికైనా వెనుకాడను. ఈ విషయంలో ఫ్యామిలీ కూడా నాకు అండగా ఉంటుంది. కాకపోతే ఇంకా ఎన్ని రోజులు దూరంగా ఉంటావు? ఇంటికి ఎప్పుడు తిరిగొస్తావు? అని అడుగుతూ ఉంటారంతే అని చెప్పుకొచ్చాడు.

ప్రేమ కహానీ
కాగా యష్‌, రాధిక 'నందగోకుల' అనే సీరియల్‌లో కలిసి నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయం తర్వాత ఫ్రెండ్‌షిప్‌గా, అనంతరం ప్రేమగా మారింది. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ రామాచారి, శాంతు స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌, మొగ్గిన మనసు, డ్రామా వంటి చిత్రాల్లోనూ కలిసి యాక్ట్‌ చేశారు. 2016లో యష్‌-రాధిక పెళ్లి చేసుకోగా వీరికి ఆర్య, యాత్రవ్‌ అని పిల్లలు జన్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement