రారాజుగా వస్తున్న యశ్‌ | Yash Telugu Dubbed Raraju Movie Release in Theatres on October 14th | Sakshi
Sakshi News home page

KGF Fame Yash: రారాజుగా వస్తున్న యశ్‌

Published Fri, Oct 7 2022 11:40 AM | Last Updated on Fri, Oct 7 2022 12:12 PM

Yash Telugu Dubbed Raraju Movie Release in Theatres on October 14th - Sakshi

కేజీయఫ్‌ సీక్వెల్స్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొదాడు కన్నడ రాక్‌స్టార్‌ యశ్‌. దీంతో యశ్‌కు టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌లో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో యశ్‌, ఆయన భార్య రాధిక పండిట్‌ జంటగా నటించిన ‘సంతు స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌’ కన్నడ చిత్రాన్ని తెలుగు రారాజుగా డబ్‌ చేస్తున్నారు. మహేష్‌ రావు దర్శకత్వంలో యశ్‌, రాధికా పండిట్‌లు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కన్నడలో మంచి విజయం సాధించింది.

ఇక ఈ చిత్రాన్ని వీఎస్‌ సుబ్బారావు ఈ నెల 14న తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘యశ్‌, ఆయన సతీమణి రాధిక నటించిన ఈ చిత్రం కన్నడలో పెద్ద సక్సెస్‌ అయ్యింది. తెలుగు ట్రైలర్‌కు, లిరికల్‌ సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement