
అనుపమా పరమేశ్వరన్
మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు కన్నడ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. అక్కడ న్యాయం కోసం పోరాడుతున్నారు. అయ్యో.. ఏమంత కష్టం వచ్చిపడింది అనుకుంటున్నారా? మరేం లేదు. బాధితుల తరఫున న్యాయం కోసం పోరాడే లాయర్‌గా ఆమె ‘నటసార్వభౌమ’ అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. పవన్ వడయార్ దర్శకత్వంలో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. కలకత్తా, బెంగళూరులో ఈ సినిమా మేజర్ షూటింగ్‌ను ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో అనుపమ లుక్‌కు సంబంధించిన ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఇక తెలుగులో ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాలో అనుపమ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ హీరోగా నక్కిన త్రినా«థరావు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.