చంపేస్తామంటూ కమెడియన్‌కు బెదిరింపులు | Comedian receives death threats from Kannada superstars family | Sakshi
Sakshi News home page

చంపేస్తామంటూ కమెడియన్‌కు బెదిరింపులు

Published Thu, Feb 4 2016 5:25 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

చంపేస్తామంటూ కమెడియన్‌కు బెదిరింపులు

చంపేస్తామంటూ కమెడియన్‌కు బెదిరింపులు

బెంగళూరు: ప్రముఖ కన్నడ కమెడియన్ బుల్లెట్ ప్రకాశ్ గురువారం పోలీసులను ఆశ్రయించాడు. తనను చంపేస్తామంటూ కన్నడ సూపర్ స్టార్ దర్శన్ కుటుంబం నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరాడు.

దర్శన్ సోదరుడు దినకర్ తూగుదీప్ తన కూతురు సమక్షంలోనే తనను చంపేస్తానని బెదిరించాడని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. 'చంపుతానని అతను చేసిన బెదిరింపులకు నా కూతురే ప్రత్యక్ష సాక్షి. అతను మరీ నీచంగా ప్రవర్తించాడు. నాకు పోలీసుల రక్షణ అవసరముంది. తాను చేసిన పోలీసు ఫిర్యాదును  వెనుకకు తీసుకోవాలని దర్శన్ అనుచరులను నన్ను వెంటాడి వేధిస్తున్నారు' అని ఆయన తన ఫిర్యాదు పేర్కొన్నాడు.

నిజానికి బుల్లెట్ ప్రకాశ్, దర్శన్ మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి అనేక హిట్ సినిమాల్లో నటించారు. దర్శన్ తో కలిసి ఓ సినిమా నిర్మిస్తానని బుల్లెట్ ప్రకాశ్ ఇటీవల ప్రకటించాడు. అయితే ఈ ప్రయత్నం అంతగా సఫలం కాలేదు. దీనిపై దర్శన్ సోదరుడు దినకర్ తో బుల్లెట్ ప్రకాశ్ కు విభేదాలు వచ్చాయి. ఈ విషయమై ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయవద్దని ప్రకాశ్ ను దినకర్ కోరాడు. ఈ వివాదం చినికిచినికి పోలీసు స్టేషన్ దాకా వెళ్లింది. దీంతో తనను చంపేస్తానని దినకర్ బాహాటంగా బెదిరిస్తున్నాడని ప్రకాశ్ చెప్తున్నారు. 2011లో భార్యను కొట్టిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ కొంతకాలంలో జైలులో గడిపారు. ఆ తర్వాత భార్యాభర్తలు రాజీ కుదుర్చుకొని కేసు వాపస్ తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement