
'ఇల్లు కట్టి చూడు- పెళ్లి చేసి చూడు' అన్న సామెత ఊరికే రాలేదు. ఈ రెండింటిలో ఏది చేయాలన్నా ఖర్చుతో కూడుకున్న పనే! ఎంత మామూలుగా పూర్తి చేయాలనుకున్నా జేబు ఖాళీ అవక తప్పదు. అయితే తను కమెడియన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందే కూతురి పెళ్లి చేయాల్సి వచ్చిందని, అప్పుడు నానా కష్టాలు పడ్డానంటున్నాడు కమెడియన్ రైజింగ్ రాజు (Raising Raju).
చందా వసూలు చేసి..
తాజాగా ఓ షోలో రాజు మాట్లాడుతూ.. బుల్లితెర కామెడీ షోలో పాల్గొనడానికంటే ముందు నా కూతురు పెళ్లి చేశాను. చందాలు వసూలు చేసి ఆ పెళ్లి చేయాల్సి వచ్చింది. రాకెట్ రాఘవ, తాగుబోతు రమేశ్, ధనరాజ్ వంటివారు చెరో రూ.5 వేలు ఇచ్చారు. అలాంటి పరిస్థితిలో నా కూతురి పెళ్లి చేశాను అని ఎమోషనలయ్యాడు. రైజింగ్ రాజు అసలు పేరు రాజమహేంద్రవరపు రాజేశ్వరరావు. స్కూల్‌లో పేరు రాయడానికి ఇబ్బందవుతోని అతడి టీచర్ రాజమహేంద్రవరపు రాజు అని మార్చేసింది.
కుటుంబ విషయాలు..
తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో జన్మించాడు. తండ్రి పేరయ్య రైతు. అయితే రాజుకు తోడుగా ఇద్దరన్నదమ్ములు, ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఏడో తరగతికే చదువు ఆపేశాడు. పెయింటింగ్ వంటి పనుల్లో చేరాడు. 1979లో చెన్నైకి వెళ్లి ఆఫీస్ బాయ్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేశాడు. ప్రస్తుతం బుల్లితెర కామెడీ షోలో రాణిస్తున్నాడు.
చదవండి: 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో.. పేరు వచ్చినా అవకాశాలు రావడం లేదు: నటుడు
Comments
Please login to add a commentAdd a comment