
సాక్షి, బొమ్మనహళ్లి: ఓ యువకుడి హత్య కేసులో పోలీసులు దంపతులతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎలక్ట్రానిక్ సిటీ డీసీపీ చంద్రశేఖర్ వివరాల మేరకు...ఎలక్ట్రానిక్ సిటీలో రీనా, గంగేశ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు యూపీకి చెందిన వారు. రీనాకు నిబాశిశ్ పాల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఈ క్రమంలో గంగేశ్ యూపీకి వెళ్లిన సమయంలో రీనా ఇంటికి నిబాశిష్ వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడు.
ఆమె లేదని తిరస్కరించడంతో ఎలాగైనా ఇవ్వాలని, లేదంటే అన్ని విషయాలు భర్తకు చెబుతానని బెదిరించాడు. దీంతో రీనా భర్తకు ఈ విషయం చెప్పింది. వెంటనే అతను బెంగళూరు వచ్చాడు. అదే రోజు పథకం ప్రకారం నిబాశిశ్‌ను ఇంటికి పిలిపించి పీకల దాకా మద్యం తాపించి గంజాయి కూడా ఇచ్చారు. అనంతరం చీరతో గొంతు పిసికి చంపేశారు.
మృతదేహాన్ని అక్కడికి నుంచి తరలించడానికి మరో స్నేహితుడు బిజోయ్‌ను పిలిపించారు. రాత్రి వేళ శవాన్ని బైక్‌లో పెట్టుకుని ఓ గుర్తు తెలియని చోట పడేసి వెళ్లిపోయారు. మరుసటి రోజే టాటాఏస్ వాహనం పిలుచుకుని వచ్చి ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. నిబాశిష్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి టాటాఏఎస్ వాహనం డ్రైవర్‌ను పట్టుకున్నారు. అతని ద్వారా నిందితులు శివమొగ్గ జిల్లా శికారిపురలో ఉన్నట్లు తెలుసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు.
(చదవండి: ప్రేమించమని వేధింపులు.. భయాందోళనతో..)
Comments
Please login to add a commentAdd a comment