ఉసేన్ బోల్ట్‌కు ఒలింపిక్ పతకం పోయింది!
ఉసేన్ బోల్ట్‌కు ఒలింపిక్ పతకం పోయింది!
Published Wed, Jan 25 2017 8:25 PM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM
ప్రపంచలోనే అత్యంత వేగమైన అథ్లెట్.. చిరుతతో కూడా పోటీపడగల సత్తా ఉన్న ఉసేన్ బోల్ట్‌కు ఒలింపిక్ పతకం చేజారింది. 2008 బీజింగ్ ఒలింపిక్ గేమ్స్‌లో జమైకా తరఫున 4x100 రిలే పోటీలో బోల్ట్‌తో పాటు పాల్గొన్న మరో అథ్లెట్ డోపింగ్ టెస్టులో దొరికేయడంతో జట్టు మొత్తానికి ఆ పతకాన్ని రద్దు చేస్తున్నట్లు ఒలింపిక్ అధికారులు తెలిపారు.
నెస్టా కార్టర్ అనే సహచర అథ్లెట్‌కు సంబంధించిన మూత్ర, రక్త నమూనాలను మరోసారి పరీక్షించగా.. అతడు నిషేధిత ఉత్ప్రేరకాలను వాడినట్లు నిరూపితమైంది. 100 మీటర్ల పరుగులో ప్రపంచంలోనే ఆరో అత్యంత వేగమైన అథ్లెట్ అయిన కార్టర్ ఎనిమిదేళ్ల క్రితం జరిగిన రేసులో నలుగురిలో మొదటగా పరిగెత్తాడు. ఆ రేసును జమైకా జట్టు 37.10 సెకండ్లలో పూర్తిచేసి ప్రపంచరికార్డు సాధించింది. కానీ, కార్టర్ డోపింగ్‌లో ఇప్పుడు దొరికేయడంతో నాటి పతకాన్ని బోల్ట్ సహా మొత్తం నలుగురు అథ్లెట్లూ పోగొట్టుకోవాల్సి వచ్చింది.
Advertisement