బోల్ట్..ట్రిపుల్ ట్రిపుల్ | Jamaica Star Usain Bolt leads to 4x100m gold, triple triples | Sakshi
Sakshi News home page

బోల్ట్..ట్రిపుల్ ట్రిపుల్

Published Sat, Aug 20 2016 7:56 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

బోల్ట్..ట్రిపుల్ ట్రిపుల్

బోల్ట్..ట్రిపుల్ ట్రిపుల్

రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో పరుగుల వీరుడు, జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా  తన పరుగుతో అభిమానులను ఉర్రూతలుగించిన బోల్ట్‌.. 4x 100 మీటర్ల రిలే పరుగులోనూ మరో స్వర్ణం సాధించాడు. ఇప్పటికే రియోలో 100మీ. 200 మీటర్లు వ్యక్తిగత ఈవెంట్లో బోల్ట్ పసిడి పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.


భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం జరిగిన 4x 100 మీటర్ల రిలేను జమైకా జట్టు 37.27 సెకన్లలో పూర్తి  చేసి అగ్రస్థానంలో నిలిచింది. దీంతో దీంతో బోల్ట్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది.  ఈ విజయంతో మూడు వరుస ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు, 4x 100 మీటర్ల రిలేలో పసిడి సాధించిన అథ్లెట్గా బోల్ట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గత బీజింగ్, లండన్ ఒలింపిక్స్ల్లో కూడా బోల్ట్ పసిడి పంట పండించిన బోల్ట్.. ఒలింపిక్స్ అపజయమే ఎరుగని ధీరుడిగా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement