200 మీ. సెమీస్‌లో బోల్ట్ | 200. Bolt in the semis | Sakshi
Sakshi News home page

200 మీ. సెమీస్‌లో బోల్ట్

Published Wed, Aug 17 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

200 మీ. సెమీస్‌లో బోల్ట్

200 మీ. సెమీస్‌లో బోల్ట్

రియో ఒలింపిక్స్ పురుషుల 200 మీటర్ల విభాగంలో స్వర్ణంపై గురి పెట్టిన జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన హీట్-9లో బోల్ట్ అందరికంటే వేగంగా 20.28 సెకన్లలో గమ్యానికి చేరి సెమీస్‌కు అర్హత పొందాడు. మొత్తం 10 హీట్స్ నిర్వహించగా... 24 మంది సెమీస్‌కు చేరుకున్నారు. ప్రతి హీట్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారితోపాటు(20) ఓవరాల్‌గా అత్యుత్తమ సమయం నమోదు చేసిన మరో నలుగురు సెమీఫైనల్ బెర్త్ దక్కించుకున్నారు.

బోల్ట్‌తోపాటు సెమీస్‌కు చేరిన వారిలో యోహన్ బ్లేక్, నికెల్ అష్మెడ్, జస్టిన్ గాట్లిన్, లాషాన్ మెరిట్ తదితర ప్రముఖ అథ్లెట్స్ ఉన్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం గం. 6.30 నుంచి 6.45 మధ్య మూడు సెమీఫైనల్స్ జరుగుతాయి. మొత్తం ఎనిమిది మంది ఫైనల్‌కు అర్హత పొందుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement