ఇప్పుడు కష్టమే: బోల్ట్ | Bolt says 200-meter world record now likely beyond him | Sakshi
Sakshi News home page

ఇప్పుడు కష్టమే: బోల్ట్

Published Sat, Dec 3 2016 11:48 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

ఇప్పుడు కష్టమే: బోల్ట్

ఇప్పుడు కష్టమే: బోల్ట్

మొనాకో: తన కెరీర్ ముగింపు దశకు వచ్చిన తరుణంలో ఇంకా రికార్డులను బద్ధలు కొడతానని అనుకోవడంలేదని జమైకా చిరుత, ప్రపంచ ప్రఖ్యాత స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ వ్యాఖ్యానించాడు. ఇక తాను పాల్గొనేది అది కొద్ది ఈవెంట్లో మాత్రమేనని, ఆ తరువాత కెరీర్ను ముగించక తప్పదని బోల్ట్ పేర్కొన్నాడు.  ఇదే క్రమంలో తాను గతంలో సాధించిన ఘనతలను సవరించడం అత్యంత కష్టంతో కూడుకున్న పని అని ఈ దిగ్గజ స్ప్రింటర్ తెలిపాడు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్ అవార్డును అందుకోవడానికి వచ్చిన బోల్ట్.. పలు అనుభవాలను పంచుకున్నాడు. తాను గతంలో 200 మీటర్ల పరుగులో 19.19 సెకెండ్లలో నెలకొల్సిన రికార్డును మరోసారి అధిగమించడం కష్టమని ఈ సందర్భంగా బోల్ట్ తెలిపాడు.

 

' నా కాళ్లు రికార్డులు నెలకొల్పే ప్రదర్శనలు ఇవ్వడానికి సహకరించడం లేదు. గత సీజన్ తరువాత ఆ రికార్డును మరోసారి అందుకునే యత్నం చేశా. అందుకోసం యత్నించా కూడా. కానీ శరీరం అందుకు సహకరించలేదు. కెరీర్ ముగించే సమయంలో విపరీతంగా శ్రమించాలని అనుకోవడం లేదు. ఈ సమయంలో ఆ రికార్డును అధిగమించే ప్రణాళికలు కూడా ఏమీ లేవు.నేను ఆ రికార్డు వెనుకే  ఉంటానేమో' అని బోల్ట్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement