
ధోనిపై జయవర్ధనే సెటైర్!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే సెటైర్ వేసి వార్తాల్లో నిలిచాడు. ఇందుకు జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ కారణమయ్యాడు. లండన్ లో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ లో భాగంగా 100 మీటర్ల రేసులో బోల్ట్ కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దాంతో బోల్ట్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో కొద్దిపాటి విమర్శలు వెలుగచూశాయి.
దీనికి జయవర్ధనే స్పందిస్తూ.. బోల్ట్ ను గౌరవించండి అంటూ ట్వీట్ చేశాడు. దానికి బదులుగా ఒక అభిమాని బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తే ధోనిని కూడా గౌరవించండి అంటూ జయవర్ధనే ట్వీట్ పై సరదాగా స్పందించాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన జయవర్ధనే..ధోని తన బైక్ మీదా? బోల్ట్ వేగాన్ని అధిగమించేది అంటూ సెటైర్ వేశాడు. అంటే బోల్ట్ వేగాన్ని అందుకోవాలంటే ధోని బైక్ పై వెళ్లినా అందుకోలేడనే ఉద్దేశం జయవర్ధనే ట్వీట్ ద్వారా స్పష్టమైంది.ఒక అభిమాని చేసిన ట్వీట్ కు జయవర్దనే ఇంతలా స్పందిచాల్సిన అవసరముందా?అనేది ధోని అభిమానుల ప్రశ్న.
Was Dhoni on his bike? https://t.co/4G92pBh8yi
— Mahela Jayawardena (@MahelaJay) 7 August 2017