బోల్ట్ ‘పరుగు’ ప్రారంభం
సెమీస్‌కు చేరిన స్టార్ అథ్లెట్
రియో: ఒలింపిక్స్‌లో వరుసగా మూడు సార్లు 100 మీటర్ల స్వర్ణం గెలిచిన అథ్లెట్‌గా రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఉసేన్ బోల్ట్ శుభారంభం చేశాడు. శనివారం జరిగిన తొలి రౌండ్ హీట్స్ పోటీల్లో నెగ్గిన బోల్ట్, సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ పోటీలో 10.07 సెకన్లలో లక్ష్యం చేరిన బోల్ట్ అగ్రస్థానంలో నిలిచాడు. ‘రేస్‌లో నా ప్రారంభం అంత గొప్పగా జరగలేదు. చురుకుదనం తగ్గినట్లు అనిపించింది.
ఏ పెద్ద ఈవెంట్‌లోనూ ఈ సమయంలో పరుగెత్తిన అలవాటు నాకు లేదు. రేపు మరింత మెరుగ్గా పరుగెడతానని ఆశిస్తున్నా’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు. ఈ క్వాలిఫయింగ్ రేస్ మధ్యాహ్నం నిర్వహించారు. తొలి రౌండ్‌లో అత్యుత్తమ టైమింగ్ (10.01 సె.) నమోదు చేసి గాట్లిన్ కూడా ముందంజ వేశాడు. యోహన్ బ్లేక్, బ్రోమెల్, మార్విన్ బ్రేసీ, ఆండ్రీ డీ గ్రేస్ 100 మీటర్ల విభాగంలో సెమీస్‌కు అర్హత సాధించిన ఇతర అథ్లెట్లు.
పురుషుల 100మీ. పరుగు
సెమీస్: సోమవారం ఉదయం గం.5.30
ఫైనల్స్: ఉదయం గం. 6.55