క్రిస్ గేల్ ఈజ్ ఏ లూజర్..
న్యూఢిల్లీ: వెస్టిండీస్ టీ 20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం ఆ జట్టు విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ పై ప్రపంచ స్టార్ అథ్లెట్, జమైకా పరుగుల వీరుడు ఉస్సేన్ బోల్ట్ సంచలన కామెంట్ చేశాడు. 'గేల్ ఈజ్ ఏ లూజర్' అని బోల్ట్ వ్యాఖ్యానించి గందరగోళానికి తెరలేపాడు. వరల్డ్ టీ 20 కప్ ను విండీస్ గెలిచిన అనంతరం ఆ జట్టుకు బోల్ట్ వీడియో రూపంలో అభినందలు తెలియజేశాడు. ఆ వీడియోను తీసే క్రమంలో తన మాటలనే పాటగా మార్చేశాడు బోల్ట్.
'మార్లోన్ ఈజ్ చాంపియన్', శామ్యూల్స్ ఈజ్ చాంపియన్, కార్లోస్ ఈజ్ చాంపియన్, బ్రేవో ఈజ్ చాంపియన్, గేల్ ఈజ్ చాంపియన్ అండ్ వెస్టిండీస్ ఈజ్ చాంపియన్ అని అప్పటివరకూ బోల్ట్ పాట బాగానే సాగినా.. ఆ వీడియో చివర్లో మాత్రం 'గేల్ ఈజ్ ఏ లూజర్' అంటూ కామెంట్ప్ చేశాడు. ఆ వీడియోను విండీస్ క్రికెటర్లకు పంపించాడు. ఈ కామెంట్ అటు విండీస్ క్రికెటర్లతో పాటు, అభిమానులను సైతం అయోమయంలో పడేసింది. బోల్ట్ నవ్వూతు చేసిన ఆ కామెంట్ కి సారాంశం అతనికే తెలియాల్సి ఉన్నా.. కీలకమైన తుదిపోరులో గేల్ ఆదిలోనే నిష్క్రమించడంతోనే ఈ రకంగా వ్యాఖ్యానించి ఉండవచ్చని అభిమానులే సర్ది చెప్పుకుంటున్నారు.