‘హ్యాట్రిక్’ కొట్టాలి: బోల్ట్ | Usain Bolt tips Brazil to win 2014 football World Cup | Sakshi
Sakshi News home page

‘హ్యాట్రిక్’ కొట్టాలి: బోల్ట్

Published Fri, Aug 30 2013 2:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM

‘హ్యాట్రిక్’ కొట్టాలి: బోల్ట్

‘హ్యాట్రిక్’ కొట్టాలి: బోల్ట్

 జ్యూరిచ్: లండన్ ఒలింపిక్స్‌లో తాను సాధించిన మూడు స్వర్ణ పతకాలను 2016 రియోడిజనిరో ఒలింపిక్స్‌లో నిలబెట్టుకోవాలని భావిస్తున్నట్లు అథ్లెటిక్స్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ చెప్పాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 100మీ., 200మీ., 4 x100 మీ. రిలేలో స్వర్ణాలు నెగ్గిన బోల్ట్ గత ఏడాది లండన్‌లోనూ వాటిని నిలబెట్టుకున్నాడు.
 
  ‘రియోలో ఆ మూడు మెడల్స్ గెలిస్తే అదో పెద్ద ఘనత అవుతుంది. ప్రస్తుతం నా దృష్టి కూడా దానిపైనే ఉంది. అయితే ఈ మూడు మినహా నాలుగో ఈవెంట్‌లో పాల్గొనే ఆలోచన మాత్రం నాకు లేదు’ అని బోల్ట్ స్పష్టం చేశాడు. జ్యూరిచ్ డైమండ్ లీగ్‌లో పాల్గొనేందుకు జ్యురిచ్ వచ్చిన బోల్ట్ ఫిఫా అధ్యక్షుడు బాట్లర్‌ను కలిశారు.   ఈ సందర్భంగా బోల్ట్ పేరుతో ఉన్న 9వ నంబర్ ఫుట్‌బాల్ జెర్సీని అతనికి బ్లాటర్ బహుమతిగా అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement