తిరుగులేని బోల్ట్
బీజింగ్: జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తన ఆధిపత్యాన్ని నిలుపుకున్నాడు. వరుసగా నాలుగో స్వర్ణం సాధించి సత్తా చాటాడు. గురువారం జరిగిన పురుషుల 200 మీటర్ల ఫైనల్ రేసులో విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. 19.55 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్నాడు. అమెరికా అథ్లెట్ జస్టిన్ గాట్లిన్ 19.74 సెకండ్లతో రెండో స్థానంలో సరిపెట్టుకున్నాడు. ఈ సారైనా బోల్ట్ ను ఓడించాలన్న గ్లాటిన్ కల ఫలించలేదు.
గత ఆదివారం జరిగిన 100 మీటర్ల రేసులోనూ బోల్ట్ విజయం సాధించాడు. గాట్లిన్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న బోల్ట్ తుదకు సెకనులో వందోవంతు తేడాతో గట్టెక్కి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు ఉసేన్ బోల్ట్ 10 బంగారు పతకాలు గెలిచాడు. అరడజను ఒలింపిక్స్ స్వర్ణాలు అతడి ఖాతాలో ఉన్నాయి.