యువరాజ్ సింగ్xఉసేన్ బోల్ట్ | Sprint king Usain Bolt to make maiden India visit | Sakshi
Sakshi News home page

యువరాజ్ సింగ్xఉసేన్ బోల్ట్

Published Wed, Aug 27 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

యువరాజ్ సింగ్xఉసేన్ బోల్ట్

యువరాజ్ సింగ్xఉసేన్ బోల్ట్

తొలిసారిగా భారత్‌కు స్ప్రింట్ కింగ్
 
బెంగళూరు: పరుగులో ‘చిరుత’ ఉసేన్ బోల్ట్ తొలి సారిగా భారత్ వస్తున్నాడు. అయితే ఈ జమైకా స్టార్ వచ్చేది అథ్లెటిక్స్‌లో పాల్గొనేందుకు కాదు. తనకు ఇష్టమైన క్రికెట్‌లో యువరాజ్‌కు సవాల్ విసిరేందుకు వస్తున్నాడు. ప్యూమా అనే కంపెనీకి ఈ ఇద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు సెప్టెంబర్ 2న చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ ఆడబోతున్నారు. ‘బోల్ట్ అండ్ యువీ-బ్యాటిల్ ఆఫ్ ద లెజెండ్స్’ పేరుతో వీరి మధ్య పోటీని నిర్వహించనున్నారు. బౌలర్‌గా ఐపీఎల్‌లో బరిలోకి దిగాలని ఉందని గతంలో మనసులో మాటను బయటపెట్టిన బోల్ట్... యువరాజ్‌తో పోటీపడటం ద్వారా తన క్రికెట్ కోరికను మరో రకంగా నెరవేర్చుకోబోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement