సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు మళ్లీ బ్రెయిన్ ఫేడ్ అయ్యిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓ యువతితో ఫొటో దిగిన సందర్భంగా విత్ ఫియాన్సీ అంటూ ట్వీట్ చేయగా.. వేరే యువతి ఫొటో పోస్ట్ చేసిన స్మిత్‌కు మళ్లీ బ్రెయిన్ ఫేడ్ అయ్యిందా ఏంటి అని జోకులు పేలుస్తున్నారు. గతేడాది భారత్‌లో టీమిండియాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా ఔట్ అయిన సందర్భంగా.. డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి రివ్యూ కోరాలా వద్దా అని చూడగా డీఆర్ఎస్ నిర్ణయం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.
తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుండగా మ్యాచ్‌లు చూసేందుకు స్డేడియానికి వెళ్లిన స్టీవ్ స్మిత్.. తన అభిమాన టెన్నిస్ స్టార్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తో దిగిన ఫొటోను ట్వీట్ చేసి తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. ఫెదరర్‌ని కలుసుకోవడం చాలా గొప్ప అనుభూతి. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు స్మిత్. డాని విల్స్ అనే యువతితో కలిసి మెల్‌బోర్న్ పార్క్ లో మ్యాచ్ చూసిన స్మిత్.. ‘మేం మ్యాచ్‌ను ఎంజాయ్ చేశాం. వాట్ ఏ బెట్టర్ ఆఫ్ ఏ మ్యాచ్’ అని ట్వీట్ చేయగా.. ఆమె అసలైన డాని విల్స్ కాదని అంటున్నారు. ఫియాన్సీ అని వేరే యువతి ఫొటో పోస్ట్ చేసిన స్మిత్‌కు మళ్లీ నిజంగానే బ్రెయిన్ ఫేడ్ అయిందని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. స్మిత్ మళ్లీ భారీ మూల్యం చెల్లించుకున్నాడని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుండగా ట్వీట్ వైరల్ అయింది.
Great night out at the @AustralianOpen with @dani_willis we both absolutely love our tennis! Thanks @CraigTiley for having us. What a belter of a match!👍🎾🙏 pic.twitter.com/DGIjJOIHNF
— Steve Smith (@stevesmith49) 22 January 2018
Comments
Please login to add a commentAdd a comment