నంబర్వన్ను కాపాడుకోవాలంటే.. | Novak Djokovic is still the biggest rival, says World No.1 Andy Murray | Sakshi
Sakshi News home page

నంబర్వన్ను కాపాడుకోవాలంటే..

Published Mon, Jan 2 2017 4:01 PM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM

నంబర్వన్ను కాపాడుకోవాలంటే..

నంబర్వన్ను కాపాడుకోవాలంటే..

దోహా: ఇటీవల తాను సాధించిన నంబర్వన్ ర్యాంకును కాపాడుకోవాలంటే శ్రమించక తప్పదని బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే అభిప్రాయపడ్డాడు. గతేడాదిని ఘనంగా ముగించిపట్ల సంతోషం వ్యక్తం చేసిన ముర్రే.. నంబర్ వన్ ర్యాంకుకు రావాలనే లక్ష్యంతోనే ఒక్కో మెట్టు ఎక్కుతూ  ఆ ఘనతు అందుకున్నట్లు తెలిపాడు.

 

ఈ ర్యాంకును సాధించడానికి ఎంత కష్టపడ్డానో, దాన్ని కాపాడుకోవడానికి కూడా అంతే శ్రమించక తప్పదన్నాడు. తనకు బలమైన ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారంటే అది సెర్బియా స్టార్ జొకోవిచ్నేనని ముర్రే తెలిపాడు. గతంలో జొకోను పలుమార్లు ఓడించినప్పటికీ అతనే తనకు కఠినమైన ప్రత్యర్థి అని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆరంభపు గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్లో జొకోవిచ్ను మరోసారి ఓడించటంపైనే దృష్టి పెట్టినట్లు ముర్రే పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement