![Paris Olympics 2024: Djokovic Beat Nadal In Second Round](/styles/webp/s3/article_images/2024/07/30/nadal.jpg.webp?itok=dUCyJkfO)
పారిస్ ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ ఈవెంట్ సింగిల్స్ విభాగంలో స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ పోరాటం ముగిసింది. సోమవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6–1, 6–4తో నాదల్‌ను ఓడించాడు. వీరిద్దరు ఇప్పటి వరకు 60 సార్లు తలపడగా.. జొకోవిచ్ 31 సార్లు, నాదల్ 29 సార్లు విజయం సాధించాడు.
వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న జొకోవిచ్‌కు ఒలింపిక్ స్వర్ణం లోటుగా ఉంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో కాంస్యం నెగ్గిన జొకోవిచ్... 2012 లండన్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం పతకాలు సాధించలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment