హిట్ హిట్ ముర్రే...
ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ టైటిల్ సొంతం
ఫైనల్లో జొకోవిచ్‌పై విజయం
నంబర్‌వన్ ర్యాంక్‌తో సీజన్ ముగింపు
లండన్: ఈ ఏడాది గొప్ప ఫామ్‌లో ఉన్న బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే సీజన్‌ను ఘనంగా ముగించాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ముర్రే విజేతగా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ముర్రే 6-3, 6-4తో నాలుగుసార్లు చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు. ఈ ఫలితంతో ముర్రే ఈ ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించాడు.
1973లో ఏటీపీ ర్యాంకింగ్‌స ప్రవేశపెట్టాక ఓ బ్రిటన్ ప్లేయర్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోవడం, సీజన్‌ను కూడా నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించడం ఇదే ప్రథమం. విజేతగా నిలిచిన ముర్రేకు 23 లక్షల 91 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.16 కోట్ల 29 లక్షలు)తోపాటు 1500 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. 29 ఏళ్ల ముర్రేకిది వరుసగా 24వ విజయంతోపాటు వరుసగా ఐదో టైటిల్ కావడం విశేషం. అక్టోబరులో బీజింగ్, వియన్నా, షాంఘై ఓపెన్ టైటిల్స్ నెగ్గిన ముర్రే... ఈ నెలలో పారిస్ మాస్టర్స్ సిరీస్‌తోపాటు ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో విజేతగా నిలిచాడు. అంతేకాకుండా 2006లో ఫెడరర్ తర్వాత మ్యాచ్ పారుుంట్‌ను కాపాడుకొని సీజన్ ముగింపు టోర్నమెంట్ టైటిల్ సాధిం చిన ప్లేయర్‌గా కూడా ముర్రే గుర్తింపు పొందాడు.
మరోవైపు ఆండీ ముర్రే సోదరుడు జేమీ ముర్రే డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌తో సీజన్‌ను ముగించాడు. టెన్నిస్ ర్యాంకింగ్‌స చరిత్రలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఇద్దరు సోదరులు ఏకకాలంలో నంబర్‌వన్ ర్యాంక్‌తో సీజన్‌ను ముగించడం ఇదే తొలిసారి కావడం విశేషం.